London: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ మంగళవారం యూకే యొక్క కొత్త హోం సెక్రటరీగా నియమితులయ్యారు, ఇప్పటి వరకు బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన సుయెల్లా ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు. కొత్తగా నియమితులైన ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ బ్రావర్‌మాన్‌ను హోం సెక్రటరీగా నియమించారు.
సుయెల్లా బ్రేవర్ మాన్ తల్లి తమిళనాడుకు చెందిన హిందూ మహిళ కాగా తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ది గోవా. ఆమె తల్లి మారిషస్ నుండియూకేకి వలస వెళ్ళగా, ఆమె తండ్రి 1960లలో కెన్యా నుండి వలస వచ్చారు. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లా గ్రాడ్యుయేట్. 2018లో రేల్ బ్రేవర్‌మాన్‌ను వివాహం చేసుకున్నారు.
బ్రేవర్‌మాన్ బౌద్ధమతస్తురాలు, ఆమె లండన్ బౌద్ధ కేంద్రానికి క్రమం తప్పకుండా హాజరవుతుంది. బుద్ధుని సూక్తుల యొక్క ‘ధమ్మపద’ గ్రంథంపై పార్లమెంటులో ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్న రువాండాకు కొంతమంది శరణార్థులను పంపించాలనే ప్రభుత్వ ప్రాజెక్టుల బాధ్యతలు బ్రేవర్‌మాన్‌కు అప్పగించే అవకాశముందని సమాచారం.