Indian IT Professionals : అమెరికాలో ఉద్యోగాల తొలగింపుతో భారత ఐటి నిపుణులకు గడ్డుకాలం

అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు చెందిన ఐటి దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి

  • Written By:
  • Updated On - January 23, 2023 / 06:52 PM IST

Indian IT Professionals : అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఐటి దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి.

ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన దేశీయ ఐటి నిపుణులు అమెరికాలో తక్షణమే ఉద్యోగాలు దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా ఇండియా నుంచి అమెరికాకు హెచ్‌1 బీ వీసాపై వెళుతుంటారు.

అక్కడ ఏదో ఓ ఐటి కంపెనీలో ఉద్యోగం చేరుతారు.

ఒక వేళ కంపెనీ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తొలగిస్తే  60 రోజుల్లోగా మరో ఏదైనా ఐటి కంపెనీలో ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలి.

లేదంటే 60 రోజుల్లో తిరిగి మాతృదేశానికి రావాల్సిన ఉంటుంది.

 

ఉద్యోగాలు పోయినవారిలో 40 శాతం మంది భారత ఐటి నిపుణులే..(Indian IT Professionals )

వాషింగ్టన్‌ పోస్టు అంచనా ప్రకారం గత నవంబర్‌ నుంచి సుమారు రెండు లక్షల ఐటి నిపుణులను కంపెనీలు తీసేశాయని వెల్లడించి

వీరిలో 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగులు ఇండియాకు చెందిన ఐటి నిపుణులే అని పేర్కొంది.

వీరిలో చాలా మంది హెచ్‌-1బీ, లేదా ఎల్‌ -1 వీసాలపై అమెరికా గడ్డపై అడుగుపెట్టి ఉంటారని తెలిపింది.

ఇక హెచ్‌-1బీ వీసా విషయానికి వస్తే ..నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా కింద అమెరికా కంపెనీలు తమకు కావాల్సిన ఐటి రంగానికి చెందిన నిపుణలను అమెరికాకు హెచ్‌-1బీ వీసా కింద రప్పించుకోవచ్చు.

దీంతో టెక్నాలజీ కంపెనీలు ప్రతి ఏడాది వేలాది మందిని ఇండియా, చైనాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు రప్పించుకుంటున్నాయి.

ఎల్‌-1బీ వీసాల విషయానికి వస్తే ఇవన్నీ తాత్కలికంగా ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌పర్స్‌ ఉంటాయి.

ఉదాహరణకు అమెరికా కంపెనీకి ఇండియాలో బ్రాంచీ ఉండి అవసరం నిమిత్తం ఉద్యోగిని అమెరికాకు బదిలీ చేస్తుంటారు.

ఇవన్నీ మేనేజిరియరల్‌ పోజిషన్స్‌, స్పెషల్‌ నాలెడ్జ్‌ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తుంటారు.

 ఉద్యోగం దొరక్కపోతే ఇండియాకు వెళ్లాల్సిందే..

హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలపై అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేసే వారుఇదే వీసాపై అమెరికాలో కొనసాగాలంటే కేవలం 60 రోజుల్లోనే కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన ఆగత్యం ఏర్పడింది.

ప్రస్తుతం అమెరికాలో ఐటి రంగానికి చెందిన ఉద్యోగితో పాటు కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలు కావాల్సివస్తోంది.

ఉన్న ఆస్తులను విక్రయించుకోవడంతో పాటు పిల్లల చదువు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి.

ప్రస్తుతం ఎవరికి లాభం అంటే టెక్‌ కంపెనీలకు అని చెప్పుకోవచ్చు.

హెచ్‌-1బీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగిని కొన్ని నెలల పాటు కొనసాగించుకొనే అవకాశం ఉంటుంది.

దీనితో పాటు ప్రస్తుతం అమెరికాలో జాబ్‌ మార్కెట్‌తో పాటు రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ కూడా అత్యంత క్లిష్టంగా తయారైందని ఐటి నిపుణులు చెబుతున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/