Site icon Prime9

Rishi Sunak: నర్సుల వేతనాలు పెంచండి.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ను కోరిన పేషెంట్

Rishi Sunak

Rishi Sunak

London: బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. సునాక్ శుక్రవారం సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ప్రశ్నించారు. దానికామె సమాధానం చెబుతూ, బాగానే చూసుకుంటున్నారని బదులిచ్చింది. ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తోందని, వాటిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. మీరు వారికి ఎక్కువ చెల్లించకపోవడం పాపం. నర్సుల వేతనాలు పెంచాలని కోరారు.

ఆమె మాటలకు రిషి బదులిస్తూ తన ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమెకు చెప్పారు. లేదు మీరు ప్రయత్నించడం లేదు. మీరు మరింత కష్టపడాలని అన్నారు. ప్రయత్నించడం కాదని, తీవ్రంగా ప్రయత్నించాలని అనడంతో ఆశ్చర్యపోయిన సునాక్ తప్పకుండా అని బదులిచ్చారు. బ్రిటన్ లో వేతనాల పెంపు కోరుతూ సమ్మె చేయాలని దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది నిర్ణయించారు.

జాతీయ వైద్య సేవల కింద బ్రిటన్‌లో 1948 నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన బడ్జెట్‌లో మూడింట ఒక వంతును ఆరోగ్య సేవల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

 

Exit mobile version