Prime9

Saveera Parkash: పాకిస్తాన్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న హిందూ మహిళ సవీరా పర్కాశ్

 Saveera Parkash: పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా పర్కాశ్ దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు.

మహిళల హక్కులకోసం..( Saveera Parkash)

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) టికెట్‌పై పర్కాశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె తండ్రి, ఓమ్ పర్కాశ్ రిటైర్డ్ డాక్టర్, గత 35 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నారు. గత ఏడాది అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన ప్రకాష్, బునర్‌లోని పీపీపీ మహిళా విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఈ ప్రాంతంలోని పేదల కోసం పని చేయడంలో తన తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నట్లు పర్కాశ్ చెప్పారు.ఈ ప్రాంతంలోని మహిళల శ్రేయస్సు, సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడం మరియు వారి హక్కుల కోసం వాదించడం కోసం తాను పనిచేస్తానని ఆమె అన్నారు.

పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ ) చేసిన ఇటీవలి సవరణల ప్రకారం, జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులను తప్పనిసరి చేర్చడం ఇప్పుడు అవసరం. 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8, 2024న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. డిసెంబరు 15న పాకిస్తాన్ ఎన్నికల సంఘం వివరణాత్మక షెడ్యూల్‌ను ప్రకటించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar