Early elections in Pakistan: పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికల డిమాండ్…380కి.మీ లాంగ్ మార్చ్…ఎవరంటే?

ఇటీవల ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సాధించిన విజయంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల నినాదాన్ని భుజాలపై ఎత్తుకొనింది. దీని కోసం లాంగ్ మార్చ్ ను నేడు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు సాగే 380కి.మీ లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Lahor: ఇటీవల ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సాధించిన విజయంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల నినాదాన్ని భుజాలపై ఎత్తుకొనింది. దీని కోసం లాంగ్ మార్చ్ ను నేడు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు సాగే 380కి.మీ లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. లాంగ్‌మార్చ్‌లో వేలాది మంది ప్రజలు వచ్చి చేరనున్నారని, మార్గమధ్యంలో పలు ర్యాలీలు నిర్వహిస్తామని ఇమ్రాన్ వర్గీయులు చెబుతున్నారు.

గత ఏప్రిల్ లో పార్టీలో చోటుచేసుకొన్న ఫిరాయింపులతో ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయాడు. అయితే ఖాన్ కు పబ్లిక్ మాత్రం మంచి మైలేజ్ ఉన్న క్రమంలో ఆయన పూర్తి స్థాయి అధికారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దేశం సొమ్మను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న లూటీదారులు, దొంగల నుంచి దేశానికి విముక్తి కలగలాని మేము కోరుకుంటున్నాం అన్న నినాదంతో ఆయన లాంచ్ మార్చ్ లో ప్రజలకు విజయ సంకేతాన్ని అందుకొనేందుకు నడుం బిగించాడు. వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ పలువురు ఆయన పార్టీలో చేరుతున్నారు.

ఇమ్రాన్ లాంగ్‌మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలకమైన కూడళ్లలో వందలాది షిప్పింగ్ కంటైనర్లు ఉంచారు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు జరిగినట్లయితే ప్రదర్శకులను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గత మేలో ఇదే తరహా నిరసన ప్రదర్శనల్లో ఖాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. కాగా, అరెస్టులతో సహా దేనికీ తాను భయపడేది లేదని ఇమ్రాన్ ఖాన్ గురువారం రాత్రి ఒక వీడియో సందేశంలో తెలిపారు. ప్రజలు ఒకటే కొరుకుంటున్నారని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలన్నదే వారి అభిమతమని అన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi-Rishi Sunak: నవంబర్ లో ప్రధానులు మోదీ-రుషి సునాక్ ల భేటీ!