IMF Loan: యుద్దంలో పూర్తిగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముందుకొచ్చింది. వచ్చే నాలుగేళ్లకు 15.6 బిలియన్ డాలర్ల రుణం సాయం అందించడానికి అంగీకరించింది. దీంతో పాటు ప్రపంచదేశాలన్నీ కలిసి మరో వంద బిలియన్ డాలర్ల సాయం అందించడానికి ముందుకు వచ్చాయి. ఈ మొత్తం కలుపుకుంటే 115 బిలయిన్ డాలర్లు అవుతాయ. ఈ నిధులు ఎనర్జీ రంగంతో పాటు దీర్ఘకాలంలో దేశం పునర్నిర్మాణానికి వినియోగిస్తారు.
గత 14 నెలల నుంచి రష్యా యుద్ధంలో ఉక్రెయిన్. ఆర్థికంగా చితికిపోయింది. ప్రపంచదేశాలన్నీ కలిసి ఉక్రెయిన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి 115 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించాయి. అయితే ఐఎంఎఫ్ మాత్రం తక్షణమే కీవ్‌కు 2.7 బిలయన్ డాలర్లు ఇవ్వనుంది. ఈ డబ్బును ఉక్రెయిన్‌ను ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్‌పై వ్యయం చేస్తుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని ఐఎంఎఫ్ ఎక్స్‌టెండెట్ ఫండ్ ఫెసిలిటి (ఈఎఫ్‌ఎఫ్) రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. తాజా రుణంతో పాటు అదనంగా అంతర్జాతీయ స్థాయిలో అన్నీ దేశాలు కలసి ఉక్రెయిన్‌కు సుమారు వంద బిలియన్ డలర్ల విలువ చేసే సాయాన్ని అందిస్తాయని ఐఎంఎఫ్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక సాయంతో పాటు ఐఎంఎఫ్ రుణం 15 బిలియన్ డాలర్లు కలిపితే మొత్తం ఉక్రెయిన్‌కు 115 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఉక్రెయిన్‌కు అందుతుంది. వాటిలో80 బిలియన్ డాలర్లు గ్రాంట్స్, కన్సెషనల్ లోన్స్ ఇవి కొన్ని దేశాలతో పాటు వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులాంటి ఇస్తాయి. అలాగే 20 బిలియన్ డాలర్ల విలువ చేసే రుణాలు రిలీఫ్ రూపంలో ఉక్రెయిన్‌కు అందుతాయి.
రుణానికి షరతులు ఏమిటంటే.. (IMF Loan)
ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ రుణాలు దక్కించుకుంటున్నప్పడు దానిక తగ్గట్టు ఉక్రెయిన్ కొన్ని షరతులు, కండిషన్లకు అంగీకరించాల్సి ఉంటుంది. వచ్చే రెండేళ్ల పాటు పన్ను రెవెన్యూ తగ్గకుండా చూసుకోవడం, అలాగే విదేశీ మారకద్రవ్యం నిల్వలు పుష్కలంగా ఉండే విధంగాను, మారకం రేటు స్థిరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే సెంట్రల్‌బ్యాంకు స్వేచ్చగా పనిచేసుకోనే విధంగా ప్రోత్సహించడం, అవినీతిని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ ఉక్రెయిన్ పై విధించిన షరతుల్లో కొన్ని. యుద్ధం ముగిసిన తర్వాత సెకండ్ ఫేజ్ సంస్కరణలు పటిష్టంగా అమలు చేయాలి. నిర్మాణారంగాన్ని యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టాల్సి ఉంటుంది. యుద్ధం ముందునాటి ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయడంతో పాటు ఇంధనరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. కాగా ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ.. రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్రం చేసి ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. అయినా ఉక్రెయిన్ అధికారులు మాత్రం ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉండేవిధంగా గట్టిచర్యలు తీసుకున్నారని వారిని ఆమె కొనియాడారు.
ఇదిలా ఉండగా మార్చి 12న ఐఎంఎఫ్ ఉక్రెయిన్‌తో స్టాప్ లెవెల్ మీటింగ్ జరిపింది. ఈ సమావేశంలోనే 15.6 బిలియన్ డాలర్ల రుణం కూడా ఖరారైంది. కాగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్ ఐఎంఎఫ్ రుణాన్ని స్వాగతించారు. రష్యా యుద్ధంలో ఇది అతి పెద్ద సహాయమని ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఐఎంఎఫ్ సాయంతో ఆర్థికంగా బలపడతామని.. యుద్ధంలో పై చేయి సాధిద్దామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యూఎస్ ట్రెజర్ సెక్రటరీ జెనెట్ యెల్లెన్ కూడా కొత్త ప్యాకేజీతో ఉక్రెయిన్ ఆర్థికంగా తన కాళ్ల మీద నిలబడ్డానికివీలవుతుందన్నారు. దీర్థ కాలిక పునర్నిర్మాణానికి ఈ డబ్బు వినియోగించుకోవచ్చన్నారు. ఉక్రెయిన్‌కు, ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా తమ వంతు సాయం అందిస్తూనే ఉంటుందన్నారు యెల్లెన్.