Site icon Prime9

Israel-Hamas War: పొరపాటుగా బందీలను చంపిన ఇజ్రాయెల్ సైన్యం.. భరించలేని విషాదమన్న నెతన్యాహు

Netanyahu

Netanyahu

Israel-Hamas War: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడీఎఫ్ ) ఉత్తర గాజాలోని షెజాయా పరిసరాల్లో జరిగిన పోరాటంలో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలపై పొరపాటున కాల్పులు జరిపినట్లు సైనిక ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం తెలిపారు.షెజాయాలో జరిగిన పోరాటంలో ఐడీఎఫ్ పొరపాటున 3 ఇజ్రాయెలీ బందీలను శత్రువులుగా గుర్తించి కాల్పులు జరపడంతో బందీలు మరణించారు.

భరించలేని విషాదం..(Israel-Hamas War)

ఐడీఎఫ్ ఈ విషాద సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. తప్పిపోయిన వారిని గుర్తించడం మరియు బందీలుగా ఉన్న వారందరినీ ఇంటికి తిరిగి తీసుకురావడం మా లక్ష్యం అని ఐడీఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పేర్కొంది.మృతి చెందిన బందీలను కిబ్బత్జ్ క్ఫర్ అజా నుండి హమాస్ అపహరించిన యోతమ్ హైమ్, సమర్ ఫౌద్ తలాల్కా, అలోన్ షమ్రిజ్ క్ఫర్ లుగా గుర్తించారు. ఇటీవలి రోజుల్లో ఇజ్రాయెల్ మిలిటరీ మరియు హమాస్ యోధుల మధ్య అత్యంత తీవ్రమైన పోరాటం జరిగిన గాజా పరిసరాల్లో ఈ సంఘటన జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.

ఈ విషాద పరిణామంపై స్పందిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనిని భరించలేని విషాదం అని పిలిచారు. గాజాలో ఐడీఎఫ్ దళాలచే పొరపాటున చంపబడిన ముగ్గురు ఇజ్రాయెల్ బందీల కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఈ ఘటన హృదయ విదారకమని, విషాదకరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లు ఖచ్చితంగా దీనిని పరిశీలిస్తారని, ఇది ఎలా జరిగిందో గుర్తించడానికి ప్రయత్నిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని పేర్కొన్నారు.

Exit mobile version