Site icon Prime9

Hindenburg: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్.. ఇదేలా పని చేస్తుందో తెలుసా?

hinden burg

hinden burg

Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.

మార్కెట్లను వణికిస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌..!

ఓ ఏళ్ల వ్యక్తి.. భారత్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించాడు. అతడు ఇచ్చిన నివేదికతో.. భారత స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి.

ఈ నివేదిక ఆధారంగా.. రూ.10 లక్షల కోట్లు ఆవిరై పోయాయి అంటే దీని ప్రభావం ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఈ నివేదిక ప్రభావంతో.. ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానం ఉన్న వ్యక్తి.. ఏకంగా 7 వ స్థానానికి పడిపోయాడంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పొచ్చు.

దీని దెబ్బకు అదానీ గ్రూప్‌ విలువ భారీగా పడిపోయింది. అక్షరాలా రూ. 4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీనికి కారణం న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థనే కారణం.

ఏమిటీ హెండెన్‌బర్గ్‌ రీసెర్చి..?

భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.

ఇది న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తుంది. 2017లో నాథన్‌ అండర్సన్‌ అనే వ్యక్తి దీనిని స్థాపించాడు.

దీని ముఖ్య ఉద్దేశం.. ఆర్థిక రంగంలో విపత్తులను గుర్తిస్తుంది. పెట్టుబడులు, రుణాలను విశ్లేషిస్తుంది.

వీటితో పాటు.. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చ్ సేవలను కూడా అందిస్తుంది. పెద్ద కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం వంటి వాటిని పసిగడుతుంది. అలాగే షార్ట్‌సెల్లింగ్‌లో పెట్టుబడులు పెడుతుంది.

ఎవరీ నాథన్‌ అండర్సన్‌..?

నాథన్‌ అండర్సన్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు.

అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ చేసిన నాథన్.. ఆ తర్వాత ఇజ్రాయెల్‌లోని అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేశాడు.

అనంతరం అమెరికా వచ్చి.. సాఫ్ట్‌వేర్‌ గా పనిచేశాడు. హిండెన్‌ ప్రారంభానికి ముందు.. రీ మార్కోపోలోస్‌ తో కలిసి ఓ సంస్థపై దర్యాప్తు చేశాడు.

ఇక హిండెన్ బర్గ్.. ఒక కంపెనీ గురించి వివరాలు సేకరించాలంటే.. ముందు ఆ కంపెనీకి సంబంధించిన రికార్డులను సేకరిస్తుంది.

కంపెనీ ఉద్యోగులతో సమాచారం సేకరించి.. హిండెన్‌బర్గ్‌తో సంస్థకు చేరవేస్తుంది. ఆ తర్వాత కంపెనీ షేర్లలో షార్ట్‌ పొజిషన్లను తీసుకుంటాయి.

ఆ కంపెనీ విలువ పతనమైనపుడు హిండెన్‌బర్గ్‌కు ఆదాయం సమకూరుతుంది.

2020లో ఇలానే ఈ సంస్థ రీసెర్చ్ చేసింది. దీంతో నికోలా కార్పొరేషన్‌ కంపెనీ విలువ 40 శాతానికి పడిపోయింది.

2017 నుంచి పలు కంపెనీలపై ఈ సంస్థ రీసెర్చ్ చేసింది.

హిండెన్‌బర్గ్‌ పేరు పెట్టడానికి గల కారణాలను ఆ సంస్థ వెల్లడించింది. హిండెన్‌బర్గ్‌ అనేది మానవుడు సృష్టించిన ఓ విపత్తు.

హైడ్రోజన్‌ నింపిన బెలూన్‌ ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అందుకే ఈ పేరు పెట్టినట్లు సమాచారం.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version