Site icon Prime9

Italy Heavy Rains: ఇటలీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 9 మంది మృతి.. ఎమర్జన్సీ విధించిన అధికారులు

Italy Heavy Rains

Italy Heavy Rains

Italy Heavy Rains:భారీ వర్షాలకు ఉత్తర ఇటలీలో నదులు పొంగిపొర్లి పట్టణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వునా నది పొంగిపొర్లడంతో ఉత్తర క్రొయేషియాలోని కొంత భాగంతో పాటు వాయువ్య బోస్నియాలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు..(Italy Heavy Rains)

ఉత్తర ఇటలీకి చెందిన అధికారులు మాత్రం స్థానికులను వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సింది బుధవారం నాడు హెచ్చరించారు. ఎందుకంటే భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లడంతో పాటు కట్టలు తెగి నీరు నగరంలోకి ప్రవేశిస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. భారీ వరదలకు ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అధికారులు బలవంతంగా ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు రైల్వే సర్వీసులను రద్దు చేశారు అధికారులు. వరుసగా గత కొన్ని రోజుల నుంచి ఉత్తర ఇటలీలో పాటు బాల్కన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగిపొర్లడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో క్రోయేషియా, బోస్నియా, స్లోవేనియా ప్రాంతాల్లో ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని.. వరదల పై సమీక్ష కూడా జరుపుతున్నామన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని, ఎమర్జెన్సీ ఎయిడ్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

రైలు సర్వీసులు రద్దు..

కాగా బుధవారం నాడు ప్రాంతీయ రూట్లలో బోలోగ్నా, రావెన్నీ ప్రాంతాల్లో రైలు సర్వీసులను రద్దు చేశారు. ఇటలీలోని పలు ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఇక బోస్నియాలోని బోసాన్స్‌ కా పట్టణ మేయర్‌ మాట్లాడుతూ తన పట్టణంలో వందలాది ఇళ్లు నీట మునిగాయన్నారు. గతంలో ఇలాంటి వరదలన తాము ఎప్పుడు చూడలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. తూర్పు స్లోవేనియాలో డజన్ల కొద్ది కొండచరియలు విరిగిపడ్డాయని, దీంతో కొన్ని ఇళ్లతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా క్రొయేషియాలో వందలాది సైనికులతో పాటు రెస్యూ టీంలు ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను వరద బాధిత ప్రాంతాలనికి తరలించారు. కాగా క్రొయేషియాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఇక ఇటలీకి చెందిన సివిల్‌ ప్రొటెక్షన్‌ మినిస్టర్‌ నెల్లో ముసేమికి మాట్లాడుతూ భారీ వరదలకు మొత్తం 24 పట్టణాల నుంచి ప్రజలను తరలిస్తున్నామన్నారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదని వస్తున్న వార్తలను ఆయన వట్టి పుకార్లని కొట్టిపారేశారు.

ఫార్మూలా వన్‌ రేసు రద్దు..

ఇదిలా ఉండగా ఉత్తర ఇటలీలో వారంతంలో జరిగే ఎమిల్లా – రోమాగ్నా ఫార్మూలా వన్‌ గ్రాండ్‌ ఫ్రీ రద్దయ్యింది. దీనికి ప్రధాన కారణం భారీ వరదలే. ఫార్మూలా వన్‌ రేసు రద్దు చేయడానికి ప్రధానకారణం ఎమర్జెన్సీ సర్వీసులపై భారం మోపరాదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఫార్మూలా వన్‌ నిర్వాహకులు.ఫార్మూలా వన్‌ రేసు చూడ్డానికి అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు. వారి భద్రతలతో పాటు టీంల భద్రతను కూడా చూడాల్సి ఉంటుందని, ఈ రేసులు కొన్ని పట్టణాలు, నగరాలను చుట్టి రావాల్సి ఉంటుంది. అధికారులంతా ఎమర్జెన్సీ సర్వీసుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వారిపై మరింత ఒత్తడి పెంచరాదనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్‌ 1 ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తానికి భారీ వర్షాలకు ఉత్తర ఇటలీలో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.

Exit mobile version