Site icon Prime9

Hamas-Israel: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు చెందని కీలక నేత హతం

Hamas Political Leader and his Wife Killed In Israeli Airstrike In Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గత కొంతకాలంగా హమాస్ సంస్థకు చెందిన రాజకీయ కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. తాజాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కీలక రాజకీయ నేత సలాహ్ అల్ బర్దావీల్ మృతి చెందినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మరణించినట్లు హమాస్ వెల్లడించింది.

 

ఈ దాడుల్లో మిలిటెంట్ సంస్థకు చెందిన కీలక నేత సలాహ్ అల్ బర్దావీల్, ఆయన భార్య కూడా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఈ విషయాన్ని తాహెర్ అల్ నోనో సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించగా.. మొదట పాలస్తీనా మీడియా వెల్లడించింది. మిలిటెంట్ సంస్థ కీలక రాజకీయ నేత బర్దావీల్, అతని భార్య ఓ స్థావరంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇద్దరు చనిపోయినట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా, మిలిటెంట్ సంస్థకు చెందిన ఓ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్‌ను కూడా ఇజ్రాయెల్ హతం చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతకుముందు గాజాపై ఐడీఎఫ్ చేసిన భారీ దాడుల్లో 400 మందికి దుర్మరణం చెందగా.. చాలా మంది గాయపడ్డారు. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో 85 మంది చనిపోగా.. హమాస్ బందీలను విడిచిపెట్టాలని, లేని సమక్షంలో గాజా భూభాగాలను ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar