Haj 2024: ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ముస్లింలు ఈద్ -అల్ అదా .. లేదా బక్రీద్ జరుపుకున్నారు. అయితే ఈద్‌ను పురస్కరించుకుని ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలం మక్కాను దర్శించుకున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. మక్కాలో సోమవారం ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటిపోయింది. దీంతో జోర్డాన్‌నుంచి వచ్చిన 14 మంది హజ్ యాత్రిలకులు వడదెబ్బకు గురై ప్రాణాలు వదిలారు. సుమారు 17 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. సౌదీ అరేబియాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. జోర్డాన్ విదేశాంగమంత్రిత్వశాఖ కూడా ఎండ వేడిమి తాళలేక 14 మంది మృతి చెందారని వెల్లడించింది.
ముస్లింల పవిత్ర స్థలం కాబాలో ఉదయం ఈద్ ఉల్ అదా ప్రార్థనలు జరిగాయి. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో ప్రపంచంవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున వచ్చి ప్రార్థనలు జరిపారు. ఇదిలా ఉండగా జోర్డాన్ విదేశాంగమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తాము సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరుపుతున్నామని.. మృతి చెందిన వారి కుటుంబసభ్యుల కోరిక మేరకు ఖననం చేయాలని సూచించారు. మృతదేహాలను జోర్డాన్ పంపాలనుకుంటే పంపండి…లేదంటే మక్కాలోనే ఖననం చేయాలంటే చేయండని కోరారు.
47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత..(Haj 2024)
ఇదిలా ఉండగా ఇరానియన్ రెడ్ క్రీసెంట్ కూడా తమ దేశానికి చెందిన ఐదుగురు పౌరులు మృతి చెందారని తెలిపింది. అయితే వారు ఎలా చనిపోయారో మాత్రం వెల్లడించలేదు. కాగా సౌదీ అరేబియా అధికారులు మాత్రం ఇరానియన్ పౌరుల మృతి గురించి మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా పవిత్ర నగరంలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి 47 డిగ్రీలకు చేరింది. పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలోఉంచుకొని సౌదీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఎండల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో అధికారులు హజ్ యాత్రికులకు సూచిస్తున్నారు. వారికి నీరు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే భక్తులు ఎండలో తిరుగరాదని.. పుష్కలంగా మంచినీరు తాగాలని సూచిస్తున్నారు.
ఈ ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 18 లక్షల మంది మక్కా మదీనాను దర్శంచుకోవాడానికి వచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాటలు, గుడారాల్లో మంటలు ఏర్పడ్డ సంఘటనలు కూడా జరిగాయి. ఎండ వేడిమికి తాళ లేక గత 30 ఏళ్ల నుంచి వేలాది మంది మృతి చెందారు. గత ఏడాది హజ్‌యాత్రకు వచ్చిన భక్తుల్లో సుమారు 240 మంది చనిపోయారు. వారిలో ఇండోనేషియా నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. అలాగే రెండు వేల కంటే ఎక్కువ మంది వడదెబ్బకు గురయ్యారు.