Canada: కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నివసించే విదేశీయులు రెండు సంవత్సరాలపాటు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనడాలో నివసించే విదేశస్థులు సొంతంగా ఇళ్లు కొనుగోలు చేయాలనే వారి కలలు కల్లలయ్యాయి. దీంతో ప్రధానంగా ఇండియా నుంచి కెనడాకు వలస వెళ్లిన భారతీయుల సొంత ఇంటి కలపై నీళ్లు జల్లినట్లయింది. సవరించిన చట్టం కూడా ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ పెట్టుబడుల కోసం విదేశీయులకు అమ్మడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడ స్థిరాస్తి ధరలు ఆకాశానికి ఎగబాకాయి.
కెనడాలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత నుంచి స్థిరాస్తి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక్కడి రాజకీయ నాయకులు మాత్రం పెట్టుబడుల కోసం రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే కొత్త నిబంధనలు విషయానికి వస్తే వలస వచ్చిన వారికి … కెనడాలో శాశ్వత నివాసితులకు కొన్ని మినహాయింపులున్నాయి. వారు ఇక్కడ పౌరులు కాదు కాబట్టి ఈ మినహాయింపులకు అనుమతిస్తున్నారు.కెనడాలో ఇళ్లను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున లాభాలు పొందాలని చూస్తున్నాయి సంపన్నమైన కార్పొరేషన్స్, విదేశీ ఇన్వెస్టర్లు. కాగా గత ఏడాది ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడాస్ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. సెకండ్ హ్యాండ్ ఇళ్లు, ఖాళీ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకాయి. కాగా గత ఏడాది ట్రుడో తన ఎన్నికల ప్రచారంలో సొంతిల్లు ప్రజలు నివసించడానికి కోసం.. ఇన్వెస్టర్ల కోసం కాదని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు.
కెనడాలో 2020 నుంచి 2021 వరకు ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతూ పోయాయి. గత ఏడాది నుంచి క్రమంగా తగ్గముఖం పట్టాయి. తాజాగా కొత్త చట్టం తీసుకువచ్చిన తర్వాత నుంచి మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఇదిలా ఉండగా కెనెడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అంచనా ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలో కెనడాలో సరాసరి ఇంటి ధర 8 లక్షల కెనడియన్ డాలర్లు పలికిందని. అటు తర్వాత నుంచి ధరలు 13 శాతం వరకు తగ్గముఖం పట్టాయని చెబుతున్నారు.