Somalia Floods: కుండపోత వర్షాల ఫలితంగా తలెత్తిన వరదలతో సోమాలియా, కెన్యాలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు నుండి వరదలతో సుమారుగా 50 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవగా దక్షిణ సోమాలియాలోని గెడో ప్రాంతంలో పౌర, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.
100 ఏళ్లకు ఒకసారి వచ్చే వరద..(Somalia Floods)
వరదలకు ఓడరేవు నగరం మొంబాసా మరియు ఈశాన్య కౌంటీలైన మాండెరా మరియు వాజిర్‌లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) $25 మిలియన్ల సాయాన్ని అందించింది. ఇది 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే వరద అంటూ హెచ్చరించింది. వరదల వల్ల డిసెంబరు నాటికి 1.5 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి నాశనమయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమాలియాలో నాలుగు సంవత్సరాల వరుస కరువు తరువాత కుండపోత వర్షాలు కురిసాయి. దీనితో వరదలు పోటెత్తి కొన్ని చోట్ల పిల్లలు, వృద్దులు కొట్టుకుపోయారు. కెన్యాలో అక్టోబర్ మరియు డిసెంబరు మధ్య వర్షాకాలంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ నిపుణులు సెప్టెంబర్‌లో హెచ్చరించడం ప్రారంభించారు. అయినప్పటికీ, అధ్యక్షుడు విలియం రూటో ఈ సూచనను పట్టించుకోలేదు.
మరోవైపు మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్‌ను కూడా వరదలు ముంచెత్తాయి. దాని రాజధాని నగరం, యౌండే, భారీ వర్షాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదలతో దెబ్బతింది, దీని ఫలితంగా 27 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు.