Congo Floods: కాంగోలోని కసాయి-సెంట్రల్ ప్రావిన్స్‌లో వరదలతో 22 మంది మరణించారు, అక్కడ కుండపోత వర్షాలు మౌలిక సదుపాయాలను నాశనం చేసి వరదలకు కారణమయ్యాయని కనంగా పట్టణ అధికారులు తెలిపారు.కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ళు, చర్చిలు మరియు రోడ్లు ధ్వసం అయి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఇళ్ల గోడలు కూలిపోయి..(Congo Floods)
కనంగా కమ్యూన్ తీవ్రంగా దెబ్బతిందని గవర్నర్ జాన్ కబేయా తెలిపారు. తాజా వరదల్లో దెబ్బతిన్న నిర్మాణాలలో హయ్యర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ కనంగా ఉంది. అలాగే ఒక చర్చి మరియు ఒక ప్రధాన రహదారి ధ్వంసం అయ్యాయి. జాతీయ ప్రభుత్వం నుండి తక్షణ సాయాన్ని కోరనున్నట్లు కబేయా తెలిపారు.ఈ మరణాలలో ఎక్కువ భాగం నివాసయోగ్యం కాని భూమిలో నిర్మించడంతో ఇళ్ల గోడలు కూలిపోవడం వల్ల సంభవించాయని కనంగా మేయర్ రోజ్ ముయాడి ముసుబే చెప్పారు. చనిపోయినవారిని గౌరవప్రదంగా పూడ్చేందుకు వీలుగా ప్రభుత్వం మాకు సహాయానికి రావాలని మరియు ప్రభుత్వం మాకు గణనీయమైన సహాయాన్ని అందించాలని నేను ప్రధానమంత్రిని కోరుతున్నానని ముసుబే పేర్కొన్నారు. మేలో తూర్పు కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో 400 మందికి పైగా మరణించారు.తూర్పు కాంగోలో డిసెంబర్ ప్రారంభంలో కుండపోత వర్షాలు బుకావు నగరాన్ని అతలాకుతలం చేయడంతో 14 మంది మరణించారు.