Site icon Prime9

Iran: ఇరాన్‌లోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో అగ్నిప్రమాదం.. 32 మంది మృతి, 16 మందికి గాయాలు.

Iran

Iran

Iran: ఉత్తర ఇరాన్‌లోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారుగా 32 మంది మరణించగా 16 మంది గాయపడ్డారు.గిలాన్‌లోని కాస్పియన్ సీ ప్రావిన్స్‌లోని లంగర్డ్‌లోని ఓపియం పునరావాస శిబిరంలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై న్యాయవ్యవస్థ విచారణ జరుపుతోందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్ద తెలిపింది.

గాయపడిన వారికి చికిత్స..(Iran)

గాయపడిన వారిని టెహ్రాన్‌కు వాయువ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్‌రౌడ్‌లోని ఆసుపత్రులకు తరలించారు.కేంద్రం నిర్వాహకులు, అధికారులు విచారణలో ఉన్నారని మిజాన్ వార్తా సంస్థ తెలిపింది.యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రకారం, ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వ్యసనాలలో ఒకటయిన డ్రగ్స్ తో పోరాడుతోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి పశ్చిమ ఐరోపా వరకు నల్లమందు మరియు హెరాయిన్‌లకు మూలమైన గసగసాలను రవాణా చేసే ప్రధాన మార్గంలో ఉంది.

Exit mobile version
Skip to toolbar