Site icon Prime9

Pope Francis : క్రైస్తవ సన్యాసినులు మరియు పూజారులు కూడా పోర్న్ చూస్తారు.. పోప్ ఫ్రాన్సిస్

Pope Francis

Pope Francis

Pope Francis: అందరిలాగే క్రైస్తవ సన్యాసినులు మరియు పూజారులు కూడా ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను చూస్తారని పోప్ ఫ్రాన్సిస్ వాటికన్‌లో జరిగిన ఒక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు.చాలా మంది వ్యక్తులు, చాలా మంది సామాన్యులు, చాలా మంది స్త్రీలు మరియు పూజారులు మరియు సన్యాసినులు ఈ దుర్మార్గమైన అలవాటును కలిగి ఉన్నారని ఆయన అన్నారు.

కొత్త తరం మతాధికారులు సోషల్ మీడియా సాధనాలను ఎలా ఉపయోగించగలరు అనే ప్రశ్నకు ప్రతిస్పందనగా పోప్ ఈ వ్యాఖ్యలు చేసారు.సోషల్ మీడియా మరియు డిజిటల్ టూల్స్‌ను “అధునాతనానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి” ఉపయోగించవచ్చని పోప్ చెప్పారు. అదే సమయంలో డిజిటల్ అశ్లీలత వంటి ప్రమాదాలకి గురికావడం గురించి వారిని హెచ్చరించారు.ప్రతిరోజు యేసు స్వీకరించే స్వచ్ఛమైన హృదయం, ఈ అశ్లీల సమాచారాన్ని అందుకోదని అన్నారు.పూజారులు మరియు సన్యాసినులను దీని గురించి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. “మీ ఫోన్ నుండి దీన్ని తొలగించండి. అపుడు మీ చేతిలో టెంప్టేషన్ ఉండదు” అని వారికి సలహా ఇచ్చారు.పోర్న్ ఆత్మను బలహీనపరుస్తుంది అని చెప్పిన పోప్, సోషల్ మీడియా సైన్స్‌లో పురోగతికి సంకేతమని పేర్కొన్నారు.

కాథలిక్ చర్చి పరిధిలోకి వచ్చే సన్యాసినులు మరియు పూజారులందరూ మతాధికారులపై విధించిన బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని ది కాన్వర్సేషన్ నివేదిక పేర్కొంది.బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞలో భాగంగా సన్యాసిని లేదా పూజారి వివాహం చేసుకోవడం మరియు ఎలాంటి లైంగిక చర్యలో పాల్గొనడం నిషేధించబడింది.

Exit mobile version