Site icon Prime9

Elon Musk: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’పై ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారో తెలుసా?

Elon Musk

Elon Musk

Elon Musk: వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజగా ఓ అడుగు ముందుకేసి ఈ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మస్క్ ఏమన్నారంటే?

వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజగా ఓ అడుగు ముందుకేసి ఈ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా సమయంలో.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాయి. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో.. దశలవారీగా ఉద్యోగులను కంపెనీలకు రావాలాని ఆదేశిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కొన్ని రోజులు ఇంటినుంచి.. మరికొన్ని రోజులు ఆఫీస్ నుంచి పని చేసే విధానం తీసుకువచ్చేలా హైబ్రిడ్ విధానం పుట్టుకొచ్చింది. కానీ చాలా మంది ఉద్యోగులు.. ఇంటినుంచే పని చేయాడనికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిపై టెస్లా సీఈఓ.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే టెస్లా ఉద్యోగులు వారానికి కనీసం.. 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని ఆదేశించారు.

ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల నుంచి ఆశించినంత ఉత్పాదకతను రాబట్టలేమని ఆయన గతంలో ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు.

తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓ అడుగు ముందుకేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం నైతికతకు సంబంధించిన విషయమన్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని నైతిక పరమైన విషయంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిన సర్వీస్‌ వర్కర్లకు తప్పుడు సందేశం వెళ్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు.

కార్ల తయారీ, వాహన సర్వీసింగ్‌, భవన నిర్మాణ కార్మికులు, వంట మనుషులు.

ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారు, ఇంట్లో ఉండి ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారిని చూసి మరో రకంగా అనుకునే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం కేవలం ఉత్పాదకతకు సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు.

Exit mobile version
Skip to toolbar