Site icon Prime9

Pakistan Crisis: గోధుమ పిండి కోసం.. బైక్‌లపై ఛేజింగ్!

Pakistan

Pakistan

Pakistan Crisis: పాకిస్థాన్ లో ఆహార కొరత రోజురోజులు తీవ్రం అవుతుంది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని.. ఆహార కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఒక గోధుమ పిండి బ్యాగ్ కోసం
వారు చేస్తున్న సాహాసాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాజాగా గోధుమ పిండి కోసం ఓ ట్రక్ వెంటా పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) లో ఆర్థిక సంక్షోభం మరిత ముదురుతుంది. ఆకలి తీర్చుకోవడం కోసం అక్కడి ప్రజలు సాహాసాలు చేస్తున్నారు.

కడుపు నింపుకునేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు.

ఇలాంటిదే ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గోధుమ పిండి లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్ ని వందలాది మంది వెంబడిస్తున్న వీడియో వైరల్ అయింది.

గోధుమ పిండి బ్యాగ్‌ను కొనుగోలు చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఇద్దరు వ్యక్తులు ట్రక్కు వెనుక ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణించడం వీడియోలో కనిపిస్తుంది.

దీని వెనకే వందలాదిమంది బైక్‌లతో ట్రక్కును వెంబడిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన ఓ వీడియోను సజ్జద్‌ రజా అనే ప్రొఫెసర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఇది బైక్‌ ర్యాలీ కాదు.. బ్యాగ్‌ గోధుమ పిండి కోసం పాకిస్థాన్‌ ప్రజల కష్టాలు అంటూ వివరించారు.

జమ్మూకశ్మీర్‌ ప్రజలు ఇప్పటికైన కళ్లు తెరవాలి అని అందులో రాశారు.

భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇంకా ఉంది.

పాకిస్థాన్‌లో భవిష్యత్తు బాగుందని భావిస్తున్నారా? అని ట్వీట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం ప్రజలు గంటల కొద్ది వేచి చూశారు.

ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తి మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.

ఆ ఘటన తర్వాత భద్రతాబలగాల పర్యవేక్షణలో పిండిని చేశారు.

ఆహార ఉత్పత్తుల ధరలు అమాంతం పెరగడంతో పాకిస్థాన్‌ ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరుకుంది.

మరోవైపు అధిక ద్రవ్యోల్బణం.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం కూడా పాక్ కు పెద్ద దెబ్బగా మారింది.

ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆర్థిక సాయం చేసేందుకు నిరాకరించాయి.

దీంతో పాక్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులో పడింది. పాక్ లో చాలామంది గోధుమ పిండిని ఉపయోగిస్తారు.

పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం రోజుల వ్యవధిలో గోధుమ పిండి ధర 41 శాతం నుంచి 57 శాతానికి పెరిగింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version