Turkey-Syria earthquake: టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే వేల సంఖ్యలో బిల్డింగ్‌లు కూలిపోవడం, గడ్డకట్టే చలి వాతావరణం, ఆహార లేమితో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించి వారం రోజులు గడుస్తుండటంతో శిథిలా కింద ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సర్వం కోల్పోయి తాత్కాలిక శిభిరాల్లో ఉన్నవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గుట్టుమిట్టుమంటూ రోజులు గడుపుతున్నారు. చలితీవ్రతకు పిల్లల దుస్తులు, ఇతర సామాగ్రిని కాల్చుతూ ఉపశమనం పొందుతున్నారు.
టర్కీ భూకంపంలో చనిపోయిన భారతీయుడు..
ఫిబ్రవరి 6న టర్కీలో భూకంపం సంభవించినప్పటి నుంచి తప్పిపోయిన భారతీయుడు మాలత్యాలోని ఓ హోటల్ శిథిలాల కింద చనిపోయాడు. ఈ విషయాన్ని టర్కీలోని భారత రాయబార కార్యాలయం శనివారం ట్వీట్‌లో తెలియజేసింది. మృతుడు విజయ్ కుమార్‌గా గుర్తించబడ్డాడు, అతను వ్యాపార నిమిత్తం టర్కీకి వెళ్లాడు. “అతని సామాను మరియు పాస్‌పోర్ట్ కనిపించాయని మాకు సమాచారం అందిందని విజయ్ కుమార్ బంధువు గౌరవ్ కలా అన్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుమార్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తనికి తల్లి, భార్య, ఆరేళ్ల పాప ఉన్నారు. నెలన్నర క్రితం తండ్రిని కోల్పోయాడు.
సహాయసామగ్రితో భారత్ నుంచి సిరియాకు బయలుదేరిన ఏడో విమానం..(Turkey-Syria earthquake)
టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచ దేశాలు తమవంతుగా సాయం అందిస్తున్నాయి. భూకంప బాధితులకు మూడు నెలల అత్యవసర వీసాలను జపాన్ మంజూరుచేసింది. బాధితులు తమ కుటుంబాలతో కలిసి తమ దేశానికి రావచ్చని జర్మనీ ఇంటీరియర్ మినిస్టర్ న్యాన్సీ ఫైజర్ తెలిపారు. ఇక భారత సైన్యానికి చెందిన 99 మంది డాక్టర్లు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన దవాఖానల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధితులకు వైద్యసాయం చేస్తున్నారు. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర సహాయ సామాగ్రితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ నుంచి తుర్కియే, సిరియాకు ఏడో విమానం బయలుదేరింది.
టర్కీ, సిరియా భూకంప బాధితులకు జర్మనీ అత్యవసర వీసాలు..(Turkey-Syria earthquake)
టర్కిష్ మరియు సిరియన్ భూకంప బాధితులకు కుటుంబంతో సహా జర్మనీ మూడు నెలల వీసాలు మంజూరు చేస్తుంది, అంతర్గత మంత్రి శనివారం చెప్పారు. ఇది అత్యవసర సహాయం” అని జర్మన్ అంతర్గత మంత్రి నాన్సీ ఫేజర్ అన్నారు. జర్మనీలోని టర్కిష్ లేదా సిరియన్ కుటుంబాలను విపత్తు ప్రాంతం నుండి తమ దగ్గరి బంధువులను అధికార యంత్రాంగం లేకుండా వారి ఇళ్లకు తీసుకురావడానికి మేము అనుమతించాలనుకుంటున్నామని ఫైజర్ తెలిపారు.