Site icon Prime9

Earth Quake : నేపాల్ లో భారీ భూకంపం.. 132 మంది మృతి, 140 మందికి గాయాలు

earth quake at nepal causes 132 death and 140 injured

earth quake at nepal causes 132 death and 140 injured

Earth Quake : నేపాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా మరో 140 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.  రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. కాగా భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని.. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక దేశ రాజధాని కాఠ్‌మాండూ లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున మళ్ళీ 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ సంతాపం ప్రకటించారు. ఈ భూకంప విపత్తుపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. భూకంప మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Exit mobile version