Site icon Prime9

Donald Trump YouTube: ఐ యామ్‌ బ్యాక్‌.. ఇన్నాళ్లు వేచి ఉంచినందుకు క్షమించండి : ట్రంప్

Donald Trump

Donald Trump

Donald Trump YouTube: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.

2024 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్‌ సోషల్‌ మీడియాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యం సతరించుకుంది.

అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత.. ఆయన సోషల్‌ మీడియా ఖాతాలపై నిషేధం విధించారు.

ఈ క్రమంలో విధించిన నిషేధం ఎత్తివేసిన తర్వాత ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వేదికల ద్వారా ఆయన అభిమానులను పలకరించారు.

 

మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో(Donald Trump YouTube)

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ట్రంప్ కు ఫేస్‌బుక్‌లో దాదాపు 34 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

యూట్యూబ్‌లో కూడా 2.6 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

క్యాపిటల్‌ భవనంపై ఆయన అనుచరుల దాడి అనంతరం 2021లో ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలపై నిషేధం విధించారు.

ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వెళ్లిన వెంటనే ఆయన ఖాతాపై ఉన్న నిషేదాన్ని గతేడాది నవంబర్‌లోనే ఎత్తివేశారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలలపై ఈ ఏడాది జనవరిలో నిషేధం తొలగించారు. యూట్యూబ్‌ ఖాతా మాత్రం శుక్రవారమే అందుబాటులోకి వచ్చింది.

 

 

ఎన్నికలే లక్ష్యంగా రీఎంట్రీ

ఈ క్రమంలోనే ‘ఐయామ్‌ బ్యాక్‌’ అంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్‌ పోస్ట్ చేశారు.

అనంతరం 2016 ఎన్నికల విజయోత్సవ సభ ప్రసంగాన్ని అందులో ఉంచారు.

‘ఇన్నాళ్లు మిమ్మల్ని వేచి ఉంచినందుకు క్షమించండి’ అంటూ కామెంట్‌ను కూడా పెట్టారు.

సోషల్‌ మీడియాలోకి రీఎంట్రీ వెనుక 2024 ఎన్నికలే లక్ష్యమని ట్రంప్ చెప్పకనే చెప్పారు.

మరో వైపు నెలల క్రితమే ట్విటర్‌ ఖాతా అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రంప్‌ ఇప్పటి వరకు ఒక్క ట్వీట్‌ కూడా చేయలేదు.

ట్విటర్‌లో ఆయనకు 87 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఒక్క ట్వీట్ కూడా చేయలేదని తెలుస్తోంది.

ట్విటర్‌కు పోటీగా ఇప్పటికే ఆయన ‘ట్రూత్‌ సోషల్‌’ పేరిట సొంతంగా ఓ ప్లాట్‌ఫాంను నెలకొల్పారు.

 

 

 

Exit mobile version