Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచల కామెంట్స్ చేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆయన ఆరోపించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. గురువారం అయోవాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసం వల్లే తాను ఓడిపోయానని, ఈసారి కచ్చితంగా తమదే విజయమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను రెండుసార్లు పోటీ చేశానని చెప్పిన ఆయన.. 2020లో కంటే 2022లో తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నెలలోనే వైట్‌హౌస్ కోసం ట్రంప్ మూడో బిడ్‌ను బహుశా వేయవచ్చని చెప్పారు. “ఇప్పుడు మన దేశాన్ని విజయవంతంగా, సురక్షితంగా, అద్భుతంగా మార్చడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని అయోవా ర్యాలీలో ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ అనుచరులు, మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై ఎంతటి విధ్వంసం సృష్టించారో తెలిసిందే.
ఇదీ చదవండి: మన రుచులను మెచ్చిన “స్టార్ బక్స్” సీఈవో.. విద్యార్థి భవన్లో ఫిల్టర్ కాఫీకి ఫిదా