Donald Trump: మాజీ అమెరికాప్రెసిడెంట్ చిక్కుల్లో పడ్డారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఓ దేశాధ్యక్షుడు చేసిన నేరానికి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్. న్యూయార్కు కోర్టు ఆయనను 34 కౌంట్‌లలో దోషిగా నిర్ధారించింది. ఇక ఆయన చేసిన నేరాల విషయానికి వస్తే తన వ్యాపారానికి సంబంధించి అన్నీ తప్పుడు రికార్డులు సృష్టించారని, అలాగే 2016లో దేశాధ్యక్షుడిగా పోటీ చేయడానికి ముందు ఓ పోర్న్ స్టార్‌ను నోరు మూయించడానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడన్న కేసుకు సంబంధించి మాన్‌హట్టన్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీకి అడ్డంకి..(Donald Trump)
గురువారం నాడు మాన్‌హట్టన్ కోర్టు చారిత్రత్మ తీర్పు ఇచ్చింది. 12 మంది సభ్యుల గల ప్యానెల్ ఏకగ్రీవంగా 77 ఏళ్ల ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది. తన వ్యాపారానికి సంబంధించి అంతా తప్పుడు రికార్డు సృష్టించడంతో పాటు అడల్ట్ పోర్న్‌స్టార్ స్ర్టోమీ డెనియల్స్ నోరు మూయించడానికి 130,000 డాలర్లు ఇచ్చాడన్న నేరం నిర్ధారణ అయ్యింది. ఈ తీర్పు ఇవ్వడానికి ముందు జడ్జిలు సుమారు ఒకటిన్నర రోజు దీనిపై కసరత్తు చేసి చివరకు ట్రంప్‌ను దోషిగా నిర్ధారించారు. దీంతో నవంబర్‌లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను ట్రంప్ కోల్పోతాడు. అయితే ట్రంప్ మాన్‌హట్టన్ కోర్టు తీర్పపై పై కోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది.
కాగా కోర్టు ట్రంప్ కేసుకు సంబంధించి ఆరువారాల పాటు 22 మంది సాక్షులను విచారించింది. వారిలో డేనియల్స్ కూడా ఒకరు. కాగా తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ప్రశాంతంగా ఉన్నారు. కోర్టు బయట ఉన్న మీడియాతో మాట్లాడుతూ .. విచారణ అంతా రిగ్గింగ్.. కేసును తారుమారు చేశారని, అవమానకరమైన విచారణ జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తీర్పు ఎలక్షన్ రోజు తెలుస్తుందన్నారు. అయితే ప్రాసిక్యూటర్లు మాత్రం ట్రంప్ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ట్రంప్ శిక్ష విషయానికి వస్తే జూలై 11న వెలువడనుంది. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ విస్కాన్సిన్‌లో జరగడానికి నాలుగు రోజుల ముందు ట్రంప్ శిక్షగురించి తీర్పు వెలువడనుంది. అదే రోజు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా జోబైడెన్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ను పోటీకి నిలుపుతూ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా అమెరికాలో ఏడాది నవంబర్ 5న ఎన్నికలు జరుగున్నాయి. ప్రస్తుతానికి ట్రంప్ ఎలాంటి డబ్బు చెల్లించకుండా బెయిల్‌పై బయటికి వచ్చారు. తాను దేశం కోసం పోరాడుతున్నాను. రాజ్యాంగం కోసం పోరాడుతున్నాను. బైడెన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేందకు ప్రయత్నాలు చేస్తోందని ట్రంప్ బైడెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.