Site icon Prime9

Donald Trump Arrest : ఆ కేసులో అరెస్ట్ అయిన డొనాల్డ్ ట్రంప్‌.. అమెరికా చరిత్ర లోనే తొలిసారి

donald trump areest in hash money case with starmi daniels

donald trump areest in hash money case with starmi daniels

Donald Trump Arrest : అమెరికాలో చరిత్ర లోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌ అయ్యారు. అధికారులు ఆయనను జైలుకి తరలించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. హష్‌మనీ కేసులో ట్రంప్‌పై మొత్తం 34 అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు ఆయన మన్‌హటన్ కోర్టులో లొంగిపోయారు. దీంతో అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు. కాగా, తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు మాన్ హట్టన్ కోర్టు ఎదుట ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

డొనాల్డ్ ట్రంప్ పై అసలు కేసు ఏంటంటే (Donald Trump Arrest)..

పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియ‌ల్స్ కు.. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అడల్ట్ ఫిల్మ్ నటి స్టార్మీ డేనియల్స్ కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి మధ్య ఉన్న లైంగిక సంబంధం విషయం బయట పెట్టకుండా ఉండేందుకే డేనియల్స్ కు ట్రంప్ డబ్బు చెల్లించారని జరిపిన విచారణలో తాజాగా రుజువైంది. ఈ ఏడాది నెలల తరబడి మాన్ హట్టన్ గ్రాండ్ జ్యూరీ సాక్ష్యాధారాలను విచారించింది. 2006లో లేక్ తాహో హోటల్ లో ట్రంప్ చేసిన లైంగిక దాడిపై మౌనంగా ఉండేందుకు తనకు డబ్బు చెల్లించారని డేనియల్స్ తెలిపింది. ట్రంప్‌ అరెస్ట్ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూయార్క్‌ సహా అమెరికాలోని పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

డేనియల్‌ను కలిసిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో తనకు లైంగిక సంబంధాలు లేవంటూ ట్రంప్ కొట్టిపారేశారు. తాను నిర్దోషినని, వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవబోతున్నందుకు ప్రతిపక్షాలు కావాలనే ఇదంతా చేస్తున్నాయని ఆరోపించారు. కాగా అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే బెయిల్‌ కోసం మాన్‌హట్టన్‌ కోర్టులో ట్రంప్‌ వాదనలు వినిపిస్తున్నారు.. త్వరలోనే ట్రంప్‌కు బెయిల్‌ వస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే షరతులు విధించే అవకాశం ఉందంటున్నారు.

2006లో ట్రంప్‌, తానూ ఓ కార్యక్రమంలో కలుసుకున్నామని, తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్‌ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలంటూ ట్రంప్‌ న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్‌ ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది. అయితే, ట్రంప్‌ను కలవడాన్ని డేనియల్స్ తన పుస్తకం ‘ఫుల్ డిస్‌క్లోజర్’లో ప్రస్తావించింది. ఆ పుస్తకం 2018లో ముద్రితమైంది.

Exit mobile version