Site icon Prime9

Disney: డిస్నీలో రెండో రౌండ్ కోతలు.. ఈసారి 4 వేలమంది

Disney

Disney

Disney: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది. ఇప్పటికే దిగ్జజ కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఉద్యోగాల కోతను చేపట్టాయి. రోజుకో కంపెనీ లేఆఫ్స్ బాటలోనే నడుస్తూనే ఉంది. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ కంపెనీ డిస్నీ మరో సారి షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో మరో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

4 వేల మందిపై వేటు(Disney)

ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రముఖ కంపెనీలు ఇంకా లేఆఫ్స్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే డిస్నీ సంస్థ పునర్వవస్థీకరణలో భాగంగా కంపెనీ ఖర్చుల్లో 5.5 బిలియన్ల డాలర్లను తగ్గించుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. అందుకే రెండో సారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో సంస్థలోని 4 వేల మంది ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది.

 

వేసవికి ముందే కోతలు

ఈసారి ఉద్యోగాల కోతలతో డిస్నీ ఎంటర్ టైన్మెంట్, ఈఎస్పీఎన్, డిస్నీ పార్క్స్ ప్రొడెక్ట్స్ పై ప్రభావం పడనుంది. రాబోయే రౌండ్ తొలగింపులు వేసవి ప్రారంభానికి ముందే ప్రారంభమవుతాయని రిపోర్టులు చెబుతున్నారు. ఉద్యోగాల తొలగింపుతో దేశవ్యాప్తంగా కాలిఫోర్నియా, బర్‌బ్యాంక్, న్యూయార్క్ సంస్థలపై ప్రభావం పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా మా సంస్థలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ఉద్యోగులంటే తనకు గౌరవం అని సీఈఓ బాబ్ ఇగర్ తెలిపారు. ఈ నిర్ణయం తేలిగ్గా తీసుకోలేదని వెల్లడించారు. గత ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతలు తీసుకున్న తర్వాత బాబ్ ఇగర్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది. ప్రపంచ వ్యాప్తంగా డిస్నీకి లక్షా 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు.

 

Exit mobile version