Site icon Prime9

Disney Layoffs: ఇపుడు డిస్నీ వంతు.. 7 వేల మందికి ఊస్టింగ్

Disney

Disney

Disney Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది.

ఇప్పటికే దిగ్జజ కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఉద్యోగాల కోతను చేపట్టాయి.

రోజుకో కంపెనీ లేఆఫ్స్ బాటలోనే నడుస్తూనే ఉంది. తాజాగా ఇపుడు ఎంటర్ టైన్మెంట్ కంపెనీ ‘డిస్నీ’వంతు వచ్చింది.

స్ట్రీమింగ్ సబ్ స్కైబర్లు భారీగా తగ్గడంతో డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది.

సంస్థ లోని దాదాపు 7 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించారు సంస్థ సీఈఓ బాబ్ ఇగర్.

 

ఈ నిర్ణయం అంత తేలిక కాదు: డిస్నీ సీఈఓ (Disney Layoffs)

ప్రపంచ వ్యాప్తంగా మా సంస్థలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ఉద్యోగులంటే తనకు గౌరవం అని సీఈఓ బాబ్ ఇగర్ తెలిపారు.

ఈ నిర్ణయం తేలిగ్గా తీసుకోలేదని వెల్లడించారు. గత ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతలు తీసుకున్న తర్వాత బాబ్ ఇగర్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది.

ప్రపంచ వ్యాప్తంగా డిస్నీకి లక్షా 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు.

 

మూడు విభాగాలుగా విభజన

ఉద్యోగాల కోతలతో పాటు డిస్నీ భారీ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా ప్రకటించింది.

కంపెనీని మూడు విభాగాలుగా చేసింది. సినిమాలు, టీవీ, స్ట్రీమింగ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ యూనిట్‌ కిందకు తీసుకురానున్నట్లు డిస్నీ వెల్లడించింది.

క్రీడలకు సంబంధించిన ఈఎస్‌పీఎన్‌ నెట్‌వర్క్‌ను ప్రత్యేక యూనిట్‌గా, డిస్నీ పార్క్‌లు, ఎక్స్‌ పీరియెన్స్‌లు, ప్రొడక్ట్‌లను మరో విభాగంగా ఏర్పాటు చేస్తున్నటు తెలిపింది.

 

తగ్గిన సబ్ స్కైబర్ల సంఖ్య (Disney Layoffs)

తాజాగా డిస్నీ ప్లస్ సబ్ స్కైబర్ల సంఖ్య భారీగా తగ్గింది. గత త్రైమాసికంలో చందాదారులు తగ్గారు.

వాల్ట్ డిస్నీ స్థాపించిన స్టోరీడ్ కంపెనీ కూడా తన స్ట్రీమింగ్ చందాదారులను కోల్పోయింది.

డిస్నీ గ్రూప్ మూడు నెలల కాలానికి $ 23.5 బిలియన్ల ఆదాయాన్ని సాధించింది. ఇది విశ్లేషకులు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ.

అయితే సంస్థ లో ఖర్చులు ఇంకా తగ్గించుకునేందుకు 7 వేల ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది డిస్నీ.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version