Site icon Prime9

UN Human Rights Council: మానవ హక్కుల ఉల్లంఘన తీర్మానం తిరస్కరణ.. ఎక్కడంటే?

Denial of Human Rights Violation resolution

Denial of Human Rights Violation resolution

Uyghur: వీగర్ ముస్లింల స్థితిగతులపై చైనాకు వ్యతిరేకంగా చేసిన మానహ హక్కుల తీర్మానాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం కెనడా, అమెరికా, బ్రిటన్‌ సహా అనేక దేశాలు ఈ ముసాయిదా తీర్మానాన్ని సమర్పించాయి. ఈ ప్రతిపాదనకు తగినన్ని ఓట్లు రాకపోవడంతో తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది.

చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానం పై 47 సభ్య దేశాలలో 17 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, చైనా సహా 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత దేశం, యుక్రెయిన్, మలేషియా సహా 11 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

అనేక ఇస్లామిక్ దేశాలు కూడా ఈ తీర్మానం పై చర్చలో పాల్గొన్నా, చాలా దేశాలు చైనాకు అనుకూలంగా ఓటు వేసాయి. కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటూ తీర్మానాన్ని చైనాకు అనుకూలంగా చేశాయి. వ్యతిరేకించిన దేశాల్లో పాకిస్థాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, సూడాన్, సెనెగల్, తదితర దేశాలు ఉన్నాయి. తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో గైర్హాజరైన ఇండియా, మలేషియా, గాంబియా, లిబియా, తదితర దేశాలు. తీర్మానానికి అనుకూలంగా సోమాలియా, అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, హోండురాస్, నెదర్లాండ్స్, పోలాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలు ఓటు వేశాయి.

ఇది కూడా చదవండి: థాయిలాండ్ లో ఘోరం.. 32 మందిని పొట్టనపెట్టుకున్న కిరాతకుడు

Exit mobile version