Site icon Prime9

Cruise ship: హాలిడే క్రూయిజ్ షిప్ లో 800 మందికి కరోనా పాజిటివ్

cruise ship

cruise ship

Sydney: ఆస్ట్రేలియాలోని సిడ్నీ రేవుకు చేరిన ఒక హాలిడే క్రూయిజ్ షిప్ లో సుమారు 800 మంది ప్రయాణీకులకు కోవిడ్-19-పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ షిప్ లో సుమారు 4,600 మంది ప్రయాణికులు ఉన్నారు.

దీనిపై షిప్ ఆపరేటర్ మార్గరీట్ ఫిట్జ్‌గెరాల్డ్ మాట్లాడుతూ 12-రోజుల ప్రయాణంలో కొద్దిమందిలో కోవిడ్ కేసులు కనుగొన్నామని అయితే ఇవి స్పల్ప లక్షణాలేనని పేర్కొన్నారు. పాజిటివ్ అని తేలినవారికి వారి ఐసోలేషన్ వ్యవధిని పూర్తి చేయడానికి ప్రైవేట్ రవాణా మరియు వసతి” లభిస్తుందని పేర్కొన్నారు నార్త్-సౌత్ వేల్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకారం, ఈ రకమైన వ్యాప్తి ఓడ యొక్క ప్రమాద స్థాయిని టైర్ 3 వద్దకు చేర్చుతుంది.

2020లో ఇంతకు ముందు ఇలాంటి సంఘటన జరిగింది. ఆగస్ట్ 2020లో, రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లోని కనీసం 900 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. షిప్ సిడ్నీ నుండి న్యూజిలాండ్ మరియు తిరిగి 11 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత, మార్చి 19న ఆస్ట్రేలియన్ రేవుకు చేరుకుంది. శుక్రవారం వరకు గడిచిన 7 రోజుల్లో న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో దాదాపు 19,800 కొత్త కేసులు కనుగొన్నారు.

Exit mobile version