Site icon Prime9

Iran: బోడిగుండుకు, మోకాలుకు ముడిపెట్టిన ఇరాన్ మతగురువు.. ఏమన్నారో తెలుసా?

Iran

Iran

Iran: బోడిగుండుకు, మోకాలుకు ముడిపెట్టడం.. జరిగే సంఘటనలకు, మాట్లాడే దానికి సంబంధం లేకపోతే సాధారణ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాట ఇది.

ఇపుడు ఇరాన్(Iran) మత గురువు మహ్మద్ మెహదీ హుస్సేనీ హమేదాని కూడా ఇపుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు.

దేశంలోని మహిళల్లో కొందరు హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదన్నారు.

ఆయన వ్యాఖ్యలపై దేశంలో మరోమారు దుమారం రేగింది. వర్షాలకు, హిజాబ్‌కు లంకె ఏంటంటూ జనం మండిపడుతున్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీకి మతగురువు మహ్మద్ మెహదీ అత్యంత సన్నిహితుడు.

హిజాబ్ ఆంధోళనలు ..

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత ఆమె వారి కస్టడీలోనే మృతి చెందింది.

అమిని మరణం దేశ్యవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనితో హిజాబ్ వద్దంటూ మహిళలు రోడ్డుపైకి వచ్చారు.

హిజాబ్‌లను తీసి నడిరోడ్డుపై మంటల్లో వేసి తగలబెట్టారు. దేశమంతా పాకిన ఈ అల్లర్లతో దిగి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం నైతిక విభాగం పోలీసు (మొరాలిటీ పోలీసింగ్)ను రద్దు చేసింది.

మహిళలు చదువుకోరాదంటూ ఆంక్షలు ..

మరోవైపు ఆఫ్గనిస్తాన్‌లో బాలికలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలకు వెళ్లి చదవుకోరాదని హుకుం జారీ చేసింది తాలిబన్‌ సర్కార్‌.

దీనితో బాలికలు, యువతులు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. గత ఏడాది అమెరికా సైన్యం ఆఫ్గానిస్తాన్‌ను వీడినప్పటి నుంచి తాలిబన్లు అధికారం చేపట్టారు.

పక్కాగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. దీంతో బాలికలు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిగి పెరగడంతో ఒక మెట్టు దిగింది తాలిబన్‌ సర్కార్‌.

ఇరాన్ కు అంతార్జాతీయ సమాజం హెచ్చారిక..

విదేశీ ప్రభుత్వాలతో పాటు అమెరికా కూడా బాలికలు, మహిళల విద్యపై తాలిబన్‌ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించింది.

లేదంటే తాలిబన్‌ ప్రభుత్వంపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది.

జీ 7 గ్రూపు దేశాలు కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యూనైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లు తాలిబన్‌ చర్యలను ఖండించాయి.

బాలికలను విద్యకు దూరం చేయడం అంటే మహిళల హక్కులను కాలరాయడమేనని జీ-7 దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

జీ -7 దేశాలే కాకుండా ముస్లిం దేశాలు టర్కీ, ఖతర్‌, పాకిస్తాన్‌ లాంటి దేశాలు కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. మహిళలను విద్యకు దూరం కానీయకుండా చూడాలని కోరాయి.

ఖతర్‌ మరో అడుగు ముందు కేసి తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరింది.

వెంటనే ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు అంటే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు స్కూళ్లను తెరవడానికి అనుమతించింది.

విద్యాశాఖ మంత్రి కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే బాలికల స్కూళ్లను తెరవాలని ఆదేశించారు. వాస్తవానికి ఆగస్టు 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన వెంటనే మహిళల హక్కులతో పాటు మైనారిటీ

హక్కుల పట్ల సానుకూలంగా ఉంటామని హామీ ఇచ్చారు. అటు తర్వాత కఠినమైన ఇస్లామిక్‌ చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version