Site icon Prime9

Pakistan Tribes Clash: పాకిస్తాన్‌లో బొగ్గుగని డీలిమిటేషన్ పై రెండు తెగల మధ్య ఘర్షణ.. 15 మంది మృతి

Pakistan Tribes Clash

Pakistan Tribes Clash

Pakistan Tribes Clash: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలోని బొగ్గు గనిని డీలిమిటేషన్ చేయడంపై సోమవారం రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది మరణించారు. కోహట్ జిల్లాలోని పెషావర్‌కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్ మరియు జర్గున్ ఖేల్ తెగల మధ్య గని డీలిమిటేషన్ విషయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

పెషావర్ ఆసుపత్రికి తరలింపు..(Pakistan Tribes Clash)

మృతదేహాలను, గాయపడిన వారిని పెషావర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య వెంటనే తెలియరాలేదని, అయితే ఎదురుకాల్పుల్లో ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.పోలీసులు మరియు ఇతర భద్రతా బలగాల సంయుక్త బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు తెగల మధ్య కాల్పులను నిలిపివేశాయి.ఈ ఘటనకు సంబంధించి దర్రా ఆడమ్ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.బొగ్గు గని డీలిమిటేషన్‌పై సన్నీఖేల్ మరియు జర్ఘున్ ఖేల్ తెగల మధ్య గత రెండు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి పలు ప్రయత్నాలు జరిగినా సఫలం కాలేదు

Exit mobile version