Site icon Prime9

China-Philippines Dispute: దక్షిణచైనా సముద్రంలో ఫిలిప్పైన్స్ నౌకలపై చైనా దాదాగిరి

China-Philippines Dispute

China-Philippines Dispute

China-Philippines Dispute: చైనా దాదాగిరి రోజు రోజుకు పెరిగిపోతోంది. కరోనా సమయంలో భారత్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయలో అక్రమ కట్టడాలు కట్టడాన్ని ఇండియా వ్యతిరేకించడంతో మొదలైన బాహాబాహీలో ఇటు ఇండియాతో పాటు అటు చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. ప్రస్తుతం చైనా దక్షిణ కొరియాను ఆక్రమించాలని చూస్తోంది. తాజాగా పిలిప్పీన్స్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో థామస్‌ షోల్‌ ప్రాంతం ఇరు దేశాల మధ్య వివాదానికి దారి కారణమయ్యింది. దీనిపై పట్టు సాధించడానికి తరచూ చైనా పిలిప్పీన్స్‌ను రెచ్చగొడుతోంది. థామస్‌ షోల్‌ ప్రాంతంలో పహారా కాస్తున్న పిలిప్పీన్స్‌ నేవీ సైనికులకు ఆహారంతో పాటు ఆయుధాలు ఇతర వస్తువులు ఇవ్వడానికి బయలుదేరిన పిలిప్పీన్స్‌ నౌకను చైనా తీరప్రాంత దళాలు అడ్డుకున్నాయి. పిలిప్పీన్స్‌ నేవీ బోట్‌లను అడ్డుకున్నాయి. వారి ఓడలను కత్తులతో గొడ్డలతో ధ్వంసం చేశాయని పిలిప్పీన్స్‌ అధికారులు తెలిపారు.

పిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌లపై దాడులు..(China-Philippines Dispute)

ఇదిలా ఉండగా చైనాకు చెందిన కోస్ట్‌గార్డు బృందం పిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌లతో వాదనకు దిగడంతో వారి ఓడలోకి ప్రవేశించి ఎనిమిది ఎం 4 రైఫిల్స్‌ను, నావిగేషన్‌ పరికరాలను ఇతర వస్తువులను తమ వెంట తీసుకువెళ్లారని పిలీప్పీన్‌ సెక్యూరిటీ అధికారులు మీడియాకు తెలిపారు. అదీ కాకుండా పిలిప్పీన్స్‌ నేవీ సిబ్బందితో గొడవ పడి వారిని గాయపర్చారు. వారిలో ఒకరి చెయ్యికూడా విరిచారని సెక్యూరిటి అధికారులు వివరించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పిలిప్పీన్స్‌నేవీపై దాడి చేసిన వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తమ సైనికులను కొట్టడంతో పాటు ఆయుధాలను ఎత్తుకెళ్లడం. ఓడలను ధ్వంసం చేయడం పట్ల పిలిప్పీన్స్‌ ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా పిలిపీన్స్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రొమియో బ్రావ్‌నెర్‌ చైనా సైనికులను పైరెట్స్‌.. సముద్రపు దొంగలుగా అభివర్ణించారు. తమ సైనికులనుంచి తస్కరించిన ఆయుధాలతో పాటు ఇతర వస్తువులను తిరిగి ఇవ్వవాలని డిమాండ్‌ చేశారు. దీంతో పాటు తమ ఓడలను నష్టపరిచినందుకు నష్టపరిహారం ఇవ్వాలని బ్రావెనర్‌ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. చైనా సైనికులతో తమ సైనికులు ధైర్యంగా పోరాడారన్నారు. చైనా సైనికులు ఆయుధాలతో వచ్చారు. తుపాకులు, కత్తులతో దాడులు చేశారు. తమ నేవీ సిబ్బంది ఒట్టి చేతులతో పోరాడాల్సి వచ్చిందన్నారు బ్రావ్‌నెర్‌. తమ ఉద్దేశం యుద్ధన్ని నివారించడమేనని ఆయన అన్నారు.

తాజా సంఘటనపై చైనా కూడా స్పందించింది. తమ సముద్ర జలాల్లోకి పిలిప్పీన్స్‌ నెవీ సిబ్బంది అక్రమంగా ప్రవేశించారని… చైనా కోస్ట్‌ గార్డ్స్‌ పలు మార్లు హెచ్చరించినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రత్యారోపణలు చేసింది. కాగా థామస్‌ షోల్‌ విషయానికి వస్తే .. ఇది మునిగిపోయిన రీఫ్‌ అంటే దిబ్బ అని చెప్పుకోవచ్చు. దీనిపై సర్వ హక్కులు తమవే అంటోంది చైనా.. అయితే ఇతర దేశాలు తైవాన్‌, వియత్నాం, బ్రూనే, పిలిపీన్స్‌, మలేషియాలు కూడా దీనిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అభ్యంతరం లేవనెత్తుతున్నాయి.

 

 

Exit mobile version