China LPG Leak: డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక రెస్టారెంట్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 31 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. డజనకుపైగా అగ్నిమాపక యంత్రాలతో ఆ ప్రాంతంలో వ్యాపించి ఉన్న మంటలను ఆర్పుతున్న ఫుటేజ్ సీసీటీవీని విడుదల చేశారు అక్కడి అధికారులు. నిగ్జియా అటామస్ ప్రాంత రాజధాని యించువాన్‌లోని ఫుయింగ్ బార్బిక్యూ రెస్టారెంట్‌లో అక్కడి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.40 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. అనేక రెస్టారెంట్లు, వినోద వేదికలు ఉండే ఆ వీధి ప్రస్తుతం చెల్లాచెదురుగా పడిఉన్న గాజు ముక్కలు, ఇతర శిధిలాలతో నిండిపోయి రక్తశిక్తంగా మారిపోయింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయి ఉన్నాయి.
ఇకపోతే స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం చైనా ప్రజలు డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మూడు రోజులు సెలవులు కావడంతో అక్కడి ప్రజలంతా బంధుమిత్రులతో సరదాగా ఉల్లాసంగా ఫెస్టివల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పండగ సమయం కావడంతో యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో చాలామంది ప్రజలకు గుమిగూడి ఉన్న సమయంలో బుధవారం రాత్రి సమయంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ గ్యాస్ లీక్ కావడంతోనే ఈ పేలుడు సంభవించిందని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. వారందరికీ స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.