Gaza: పిల్లల శరీరాలు కాలిపోయి.. అవయవాలు తొలగించి.. గాజాలో దారుణ పరిస్దితులను వివరించిన అమెరికన్ నర్సు

గత వారం గాజా నుండి తరలించబడిన ఒక అమెరికన్ నర్సు యుద్ధం తో దెబ్బతిన్న గాజాలో తన అనుభవాలను వివరించింది, ఆహారం మరియు నీటి కొరత కారణంగా ఆమె మరియు ఆమె బృందం దాదాపు ఆకలితో చనిపోయే పరిస్దితికి వచ్చామని చెప్పింది. ఇజ్రాయెల్ నిరంతరం బాంబు దాడులు చేయడంతో శరీరాలపై తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న పిల్లలను తాను చూశానని ఆమె చెప్పింది.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 08:06 PM IST

Gaza: గత వారం గాజా నుండి తరలించబడిన ఒక అమెరికన్ నర్సు యుద్ధం తో దెబ్బతిన్న గాజాలో తన అనుభవాలను వివరించింది, ఆహారం మరియు నీటి కొరత కారణంగా ఆమె మరియు ఆమె బృందం దాదాపు ఆకలితో చనిపోయే పరిస్దితికి వచ్చామని చెప్పింది. ఇజ్రాయెల్ నిరంతరం బాంబు దాడులు చేయడంతో శరీరాలపై తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న పిల్లలను తాను చూశానని ఆమె చెప్పింది.

యాబైవేలమందికి నాలుగు టాయిలెట్లు..(Gaza)

ఎమిలీ కల్లాహన్ అనే ఈ నర్సు CNN వార్తా సంస్దకు ఇచ్చిన ఇంటర్యూలో తన అనుభవాలను వివరించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సహాయ బృందంతో కలిసి  ఆమె బృందం వైద్య సేవలందించారు.పిల్లలు తమ ముఖాలపై, మెడపై, వారి అవయవాలన్నింటిపై కాలిన గాయాలతో ఉన్నారని చెప్పారు.రన్నింగ్ వాటర్ సదుపాయం లేకుండా పిల్లలను శరణార్థి శిబిరాలకు పంపుతున్నారని కల్లాహన్ చెప్పారు.వారికి రోజుకు నాలుగు గంటల నీరు ఇస్తారని చెప్పారు దక్షిణ గాజాలోని యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో నడిచే ఖాన్ యూనిస్ శిక్షణా కేంద్రంలో యాబైవేలమంది శరణార్దులకు కేవలం నాలుగు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని ఆమె తెలిపారు. అక్కడ ఒక వ్యక్తికి రెండు చదరపు మీటర్లు (సుమారు 21 చదరపు అడుగుల) కంటే తక్కువ స్థలం ఉంది. శరీరభాగాలు కాలిపోవడంతో పలువురికి అవయవాల తొలగింపు జరిగిందన్నారు

షెల్టర్స్ లో 20 లక్షలమంది ప్రజలు..

UNRWA, పాలస్తీనియన్ శరణార్థులకు సహాయం చేసే ఏజెన్సీ ప్రకారం, గాజా యొక్క మొత్తం జనాభాలో 70 శాతం మంది రెండు మిలియన్లకు పైగా ప్రజలు యునైటెడ్ నేషన్స్ షెల్టర్స్ లో దయనీయమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. ఇక్కడ నీరు మరియు పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో ప్రజారోగ్య సంక్షోభంలో పడింది. కల్లాహన్, ఆమె మరియు ఆమె బృందం ఆహారం మరియు నీటి కోసం స్నేహితులకు ఫోన్ చేసేవారని తెలిపారు. వారు లేకుంటే మేము ఆకలితో చనిపోతామని చెప్పడం అతిశయోక్తి కాదని ఆమె పేర్కొన్నారు.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించినప్పటి నుండి గాజాలో 10,000 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌లో 1,400 మందికి పైగా మరణించారు. గాజాలోని టెర్రర్ గ్రూప్‌పై వైమానిక బాంబు దాడులు మరియు గ్రౌండ్ ఆపరేషన్లతో ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది.