US Election 2024: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా 2024లో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్ పెర్ఫార్మెన్స్ పేలవంగా ఉందన్న వార్తలు పచ్చిన నేపధ్యంలో అతడిని అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది. తాజాగా అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ డెమొక్రాట్లు బైడెన్ స్దానంలో మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను తమ నామినీగా నామినేట్ చేస్తారని అన్నారు.
మరోవైపు బైడెన్ కూడా డిబేట్ ముగిసిన తరువాత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. నేను యువకుడిని కాదని నాకు తెలుసు. నేను చక్కగా మాట్లాడలేను. సమర్దవంతంగా వాదించలేను అని నాకు తెలుసు అంటూ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో బైడెన్ వయస్సుపై పెరుగుతున్న ఆందోళనలు మరియు అతని మానసిక దృఢత్వంపై సందేహాల నేపధ్యంలో అతని స్థానంలో మరొక అభ్యర్థిని నియమిస్తారని చాలా మంది ఊహించారు. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని మిచెల్ ఒబామాను కోరారు. అయితే మిషెల్లీ తనకు ఆసక్తి లేదంటూ చెప్పారు.
నామినేట్ చేయడం సులువేనా..(US Election 2024)
డిబేట్‌లో బైడెన్ మాట్లాడిన తీరు చూసాక డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లు, అభిమానులు అతని శారీరక,మానసిక సామర్ద్యం గురించి ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం బైడెన్ వయసు 81 ఏళ్లు. ఈ సమయంలో మరలా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటికీ అతను బాధ్యతలను నెరవేర్చలేరన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే డెమోక్రటిక్ పార్టీ నిబంధనల ప్రకారం నామినీని వారి సమ్మతి లేకుండా భర్తీ చేయడం చాలా కష్టం. మరణం, రాజీనామా లేదా అసమర్థత వంటి సందర్భాల్లో నామినీని భర్తీ చేయడానికి అనుమతిస్తుంది కానీ అభ్యర్థులను మార్చాలనే కోరిక కారణంగా కాదు. అందువలన బైడెన్ ను పక్కకు తప్పించడం ఇపుడు అంత సులభం కాదని తెలుస్తోంది. ఒకవేళ బైడెన్ తన అభ్యర్దిత్వాన్ని ఉపసంహరించుకుంటే, డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధులు కొత్త నామినీని ఎన్నుకునే బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం బైడెన్ కు అనుకూలంగా ఉన్నవారిలో ఎక్కువ మంది ప్రతినిధులు సమావేశమై ప్రత్యామ్నాయంపై ఓటు వేయాలి, ఇమెజారిటీ ఓటు ద్వారా కొత్త అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష నామినీలను ఎంపిక చేయడానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశముంటుంది. వియత్నాం యుద్ధంపై వ్యతిరేకత కారణంగా తిరిగి ఎన్నికలకు వెళ్లకూడదని అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1968లో నిర్ణయించారు. 1972లో మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా జార్జ్ మెక్‌గవర్న్‌స్థానంలో సెనేటర్ థామస్ ఈగిల్‌టన్‌ని నియమించడం జరిగింది. మరి బైడెన్ విషయంలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందా లేదా కొనసాగిస్తుందా అన్నది చూడాలి.