Site icon Prime9

Australian girl: బొమ్మలు అమ్మడం ద్వారా నెలకు రూ. 1.6 కోట్లు సంపాదిస్తున్న ఆస్ట్రేలియా బాలిక

Australian girl

Australian girl

Australian girl: 11 ఏళ్ల బాలిక తన చదువుపై దృష్టి పెట్టడానికి తన వ్యాపారం నుండి రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. బాలిక ఏమిటి? రిటైర్మెంట్ ఏమిటి? అయితే ఇది నిజం. చాలా మంది పిల్లలు తమ పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపైన ఆధారపడే వయస్సులోనే ఆస్ట్రేలియా కు చెందిన పిక్సీ కర్టిస్ బొమ్మలు అమ్మడం ద్వారా నెలకు సుమారు రూ1.6 కోట్లు సంపాదించడం ప్రారంభించింది.

హైస్కూల్లో చేరడానికి బిజినెస్ నుంచి రిటైర్ అవుతున్న పిక్సీ..(Australian girl)

అయితే వ్యాపారం వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పిక్సీ తన విద్యపై దృష్టి పెట్టడానికి పిక్సీ రిటైర్మెంట్ అవడానికి సిద్దమయింది. పిక్సీతల్లి రాక్సీ జాసెంకో ఈ విషయాన్ని తెలిపారు. పిక్సీ హైస్కూల్‌లో చేరబోతున్నందుకు దృష్టి పెట్టడానికి తన ఆన్‌లైన్ బిజినెస్ ను వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది. గత కొన్ని నెలలుగా, మేము ముందుకు సాగుతున్న వ్యాపార ప్రణాళికల గురించి చర్చిస్తున్నాము.ఇది మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన అద్భుతమైన ప్రయాణం అయితే హైస్కూల్‌పై దృష్టి పెట్టడానికి ఇది సమయం అని నిర్ణయించుకుంది.మేము వ్యాపారాన్ని కొనసాగిస్తాము. కాని పిక్సీ మాత్రం తక్కువ సమయం మాత్రమే కేటాయిస్తుందని తెలిపారు.

బర్త్ డే కు రూ.33 లక్షలు ఖర్చు

చిన్నవయసులోనే వ్యాపారం ద్వారా నెలకు కోటిరూపాయలకు పైగా సంపాదిస్తున్న పిక్సీ విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉంది. పిక్సీ సుమారు రూ. 2 కోట్లు విలువైన Mercedes Benz Glని కలిగి ఉంది. ఆమె 11వ పుట్టినరోజు వేడుకకు సుమారు రూ. 33 లక్షలు ఖర్చయింది. పిక్సీ రిటైర్మెంట్ క ప్లాన్ చేస్తున్నందున, కుటుంబం ఇతరులకు సహాయం చేయడానికి డబ్బును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. బేర్ కాటేజ్, రోనాల్డ్ మెక్‌డొనాల్డ్ హౌస్, లిటిల్ వింగ్స్ మరియు విన్నీస్‌తో సహా పలు పిల్లల స్వచ్ఛంద సంస్థలకు ఖర్చు చేయడానికి సుమారు రూ. 24 లక్షలు స్టాక్‌లో కొనుగోలు చేసినట్లు రాక్సీ తెలిపారు.

Exit mobile version