Mexico: మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఏడాదిన్నర పసిబిడ్డతో సహా కనీసం 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వలనే.. (Mexico)
ఓక్సాకా ఇంటీరియర్ సెక్రటరీ జెసస్ రొమెరో మాట్లాడుతూ, రాష్ట్రంలోని మిక్స్‌టెకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అలసట కారణంగా బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని మరియు 25 మీటర్ల లోతైన లోయలో పడిందని చెప్పారు. నైపుణ్యం లేకపోవడం మరియు అలసట కారణంగా ప్రమాదం సంభవించినట్లు కనిపిస్తోందని అన్నారు. గాయపడిన వారిని ఇన్‌స్టిట్యూటో మెక్సికానో డి సెగురో సోషల్ (IMSS) క్లినిక్‌కి తరలించారు.
మృతుల్లో 13 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో ఇంటికి వెళ్తున్నారని తెలుస్తోంది. ఓక్సాకా గవర్నర్ సాలోమన్ జారా ఈ విషాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.బాధితులను ఆదుకోవాలని వివిధ రాష్ట్ర ఏజెన్సీలు మరియు విభాగాలను ఆదేశించారు.