Saudi Arabia: సౌదీ అరేబియాలో బస్సు వంతెనను ఢీకొని బోల్తాపడి మంటలు చెలరేగడంతో 20 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారు. బస్సుబ్రేకులు ఫెయిల్ కావడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మక్కాకు వెడుతున్న యాత్రికులు..(Saudi Arabia)
సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మక్కాకు బస్సు యాత్రికులను తీసుకువెడుతోంది. బస్సులో పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే వారి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్బంగా మక్కాకు యాత్రికులను తీసుకువెళ్లే బస్సులు ఎక్కువగా ఉంటాయి. ఉమ్రా తీర్థయాత్రల కోసం రద్దీగా ఉండే సమయం కావడంతో తరచుగా ట్రాఫిక్ అంతరాయాలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో లక్షలాది మంది ముస్లింలు వార్షిక హజ్ తీర్థయాత్ర చేస్తారని అంచనా.
ఈక్వెడార్ లో కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి..
ఈక్వెడార్‌లోని ఆండియన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు, 23 మంది గాయపడ్డారు. దాదాపు 50 మంది తప్పిపోయారు. ఇంతకుముందు, ఈక్వెడార్‌లోని చింబోరాజో ప్రావిన్స్‌లోని అలౌసి నగరంలో కొండచరియలు విరిగిపడటంతో 16 మంది మరణించారని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు ఈక్వెడార్ అంతటా రోడ్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ఈ నెల ప్రారంభంలో అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో తీవ్రమైన వాతావరణం మరియు బలమైన భూకంపం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 14 ప్రావిన్సులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
కుక్కల సాయంతో శిథిలాల మధ్య రెస్క్యూ సిబ్బంది ప్రాణాల కోసం వెతికారు. కొన్ని ప్రాంతాల్లో, చాలా ఇళ్ళు పూర్తిగా భూమిలో కూరుకుపోయాయి..బురద కారణంగా ఒక స్టేడియం పూర్తిగా సమాధి కాగా, క్రీడలు మరియు సంగీత కార్యక్రమాల కోసం ఉపయోగించే మరో వేదిక కూలిపోయింది.
యూఎస్ పాఠశాలలో కాల్పులు.. ఆరుగురి మృతి..
అమెరికాలోని నాష్‌విల్లేలో ఒక ప్రైవేట్ క్రిస్టియన్ గ్రేడ్ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో కనీసం ముగ్గురు పిల్లలు మరియు ముగ్గురు పెద్దలు మరణించారు. పోలీసులతో జరిగిన ఘర్షణలో నిందితుడు కూడా చనిపోయాడు.గత ఏడాది జూన్‌లో, యునైటెడ్ స్టేట్స్‌లో తుపాకీ హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలు మరియు కుటుంబాలను రక్షించడం కోసం యుఎస్ దాడి ఆయుధాలను నిషేధించాలని లేదా వాటిని కొనుగోలు చేసే వయస్సును 18 నుండి 21కి పెంచాలని అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు.