Rishi Sunak: యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం తన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించారు. సునక్ ఈరోజు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు.మాజీ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ యూకే కొత్త హోం మంత్రిగా ,మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు అంటూ 10 డౌనింగ్ స్ట్రీట్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
పోలీసులపై చేసిన విమర్శలతో..( Rishi Sunak)
శనివారం లండన్‌లో పాలస్తీనా మద్దతు దారులు ర్యాలీ చేసినప్పుడు పోలీసులు వారిని నియంత్రించలేకపోయారంటూ బ్రేవర్‌మన్ చేసిన విమర్శలపై చి రిషి సునక్ ప్రతిపక్షం, లేబర్ పార్టీ మరియు ప్రజల నుండి ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ ర్యాలీపై బ్రేవర్ మాన్ యూకే ఆధారిత వార్తాపత్రిక టైమ్స్‌లో ఒక అభిప్రాయాన్ని రాశారు. దీనికి ఆమె సునక్ అనుమతి తీసుకోలేదు. మార్చ్ సమయంలో పాలస్తీనియన్ అనుకూల కార్యకర్తలు వలన ఏర్పడిన అలజడిని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది.బ్రేవ్‌మాన్ యొక్క వైఖరి ఉద్రిక్తతలను రేకెత్తించడానికి మరియు లండన్ వీధుల్లోకి రావడానికి నిరసనకారులు రావడానికి సహాయపడిందని ఆరోపణలు వచ్చాయి.ప్రభుత్వం నుండి వైదొలగాలని సునాక్ బ్రేవర్‌మన్‌ను కోరగా ఆమె అంగీకరించింది.ఇలా ఉండగా తన తొలగింపు వార్తలపై స్పందిస్తూ బ్రేవర్‌మన్ హోం సెక్రటరీగా పనిచేయడం నా జీవితంలో గొప్ప అదృష్టం. నేను తగిన సమయంలో మరిన్ని విషయాలు చెప్పవలసి ఉంటుందని అన్నారు.