Site icon Prime9

అమెరికా: పడిపోతున్న ఉష్ణగ్రతలు.. అమెరికాలో బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి..?

bomb cyclone in america

bomb cyclone in america

Winter Storms Hit America: అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఆ దేశంలోని ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి.. అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది. అయితే, అక్కడి వాతావరణం మాత్రం ఊహించని స్థాయిలో ఇబ్బంది పెడుతోంది. గ్యాప్ లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుపాన్, చలి ప్రభావంతో క్రిస్మస్ వేళ అమెరికా ప్రజలు కాలు కదపలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ మంచు తుపాన్ ధాటికి అమెరికాలో 18 మంది మరణించారు.

చీకట్లో అమెరికా రాష్ట్రాలు

వాతావరణ పరిస్థితులు సహకరించక దేశవ్యాప్తంగా 2,700కుపైగా విమానాలు రద్దయ్యాయి. అంతేకాకుండా తీవ్రంగా కురుస్తున్న మంచు వర్షం కారణంగా అనేక ప్రాంతాలకు కరెంటు సరఫర నిలిచిపోయింది. అమెరికా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లోనే జీవనం గడుపుతున్నారు. అసలే మంచు తుపాను, దానికి తోడు చలి గాలులు వాటితోనే ఇబ్బంది పడుతున్నామనుకుంటే అక్కడి ప్రజలు ఇప్పుడు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో పలు ప్రమాదాలు జరిగాయి. అనేక కార్లు ఢీకొన్నాయి. చెట్లు కూలిపోయాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల రోడ్లపై వందలాది మంది వాహనాల్లో చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు.

నిలిచిన క్రిస్మస్ వేడుకలు

తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలకు ఆటంకం కలుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి క్రిస్మస్ సెలవులకు సొంత ప్రాంతాలకు వెళ్దామనుకుంటున్న వాళ్లకు మంచు తుపాన్ ఆటంకంగా మారింది. మంచు కారణంగా లక్షలాది ప్రజలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. అనేక ఈవెంట్స్, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్థానికులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు చేరుకోవడం కూడా కష్టమవుతోందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.

కాగా, అమెరికాలో మంచు, చలి ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు స్తానికులు పలు రకాల వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. నీళ్లు కూడా గడ్డకట్టేస్తున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఓ వ్యక్తి ఒక జగ్గులో వేడి వేడి నీటిని తీసుకుని వాటిని ఆరుబయట గాలిలోకి ఎగరేయగా, అవి క్షణాల్లోనే గడ్డకట్టిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

బాంబ్ సైక్లోన్..
ప్రస్తుతం అమెరికా దేశంలోని మంచు తుఫాను కురువడాన్ని బాంబ్ సైక్లోన్ గా వ్యవహరిస్తున్నారు. వాతావరణ శాస్త్ర ప్రక్రారం “బాంబోజెనిసిస్” అనే పదం నుండి వచ్చిన బాంబు తుఫాను వచ్చింది. బాంబు తుఫాను అనగా వాతావరణ పీడనం చాలా త్వరగా పడిపోతుంది అంటే 24 గంటల్లో కనీసం 24 మిల్లీబార్లు పడిపోవడం. ఒక మాటలో చెప్పాలంటే తుఫాను వేగంగా తీవ్రతరం అవుతుందని దీని అర్థం.

 

Exit mobile version