Site icon Prime9

Kabul Bomb Blast: కాబూల్‌లో బాంబు పేలుడు..19 మంది దుర్మరణం

Bomb blast

Bomb blast

Kabul: ఆఫ్గనిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభ‌వించింది. ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద జ‌రిగిన పేలుడులో 19 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద పేలుడు జ‌రిగింది. యూనివ‌ర్సిటీ ప‌రీక్ష రాస్తున్న విద్యార్థుల‌ను సూసైడ్ బాంబ‌ర్‌ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హ‌జారా మైనార్టీ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఆ స్టడీ సెంట‌ర్ వ‌ద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు భావిస్తున్నారు. గ‌తంలోనూ ఆ వ‌ర్గం పై దాడులు జ‌రిగాయి. అయితే ప్రస్తుత దాడికి బాధ్యత ఎవ‌రూ ప్రక‌టించుకోలేదు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో విద్యార్థులు ప‌రీక్షల కోసం ప్రిపేర‌వుతున్నట్లు తెలిసింది.

Exit mobile version