Iraq: తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో గుర్తుతెలియని ముష్కరులు బాంబులతో దాడి చేయడంతో కనీసం 11 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. దాడికి బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు.
భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ముక్దాదియా ప్రాంతంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దాడి అనంతరం ముష్కరులు అక్కడి నుంచి పారిపోయారు, దాడిలో మరణించిన వారందరూ సాధారణ పౌరులేనని సమాచారం. షియా మరియు సున్నీ ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతల కారణంగా దియాలా ప్రావిన్స్‌లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఘటనపై స్పందించిన దియాలా గవర్నర్ ముతన్నా అల్-తమీమి ఉగ్రదాడి చేసిన వారిని వెంబడిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. కుర్దిష్ రీజియన్ ప్రెసిడెంట్ నెచిర్వాన్ బర్జానీ మాట్లాడుతూ, ఈ దాడి ఉగ్రవాదం ఇప్పటికీ నిజమైన ముప్పు మరియు సవాలును కలిగిస్తోందని మన శక్తితో వాటిని ఎదుర్కోవాలి అనే వాస్తవాన్ని రుజువు చేస్తుందని తెలిపారు.ఇరాన్ మరియు ఇరాక్ రెండింటికీ సరిహద్దుగా స్వయంప్రతిపత్తి కలిగిన దియాలా ప్రావిన్స్ ప్రధాన అక్రమ రవాణా మార్గంగా ఉంది.