Site icon Prime9

London: బ్రిటన్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్న బాలీవుడ్‌ హాస్య నటుడు సతీశ్‌ షా

London

London

London: బాలీవుడ్‌ హాస్య నటుడు సతీశ్‌ షా బ్రిటన్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయ సిబ్బంది.. నటుడు, ఆయన కుటుంబాన్ని అవమానపర్చేలా మాట్లాడారు. దానికి ఆయన బదులిస్తూ.. ‘మేం భారతీయులం’ అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల సతీశ్ ఆయన కుటుంబంతో కలిసి బ్రిటన్‌ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతుండగా.. అక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగి హేళనగా మాట్లాడాడు. ‘‘వీళ్లు ఫస్ట్‌ క్లాస్‌ విమాన టికెట్‌ ఎలా కొనుగోలు చేయగలిగారు?’’ అంటూ తోటి ఉద్యోగితో అన్నాడు. ఈ మాటలు వినిపించగా సతీశ్ వారి వద్దకు వెళ్లి.. ‘‘ఎందుకంటే మేం భారతీయులం’’ అని గర్వంగా సమాధానమిచ్చాడు. ఈ సంఘటనను సతీశ్ తన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. సతీశ్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా.. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు కూడా స్పందిస్తూ.. నటుడికి క్షమాపణలు తెలియజేసింది. ‘‘మీకు ఎదురైన చేదు అనుభవానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. దీనిపై మీరు మాకు మరిన్ని వివరాలను నేరుగా పంపగలరా?’’ అని అడిగింది. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన సతీశ్ షా.. పాపులర్‌ టీవీ కామెడీ షో ‘సారాభాయ్‌ వర్సెస్‌ సారాభాయ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరో హిందీ షో ‘కామెడీ సర్కస్‌’లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’, ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’, ‘కహో నా ప్యార్‌ హై’, ‘మై హూ నా’, ‘కిచిడీ’ వంటి చిత్రాలతో మెప్పించిన సతీశ్.. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 5వ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను భారత్‌ వెనక్కి నెట్టింది. దీంతో బ్రిటన్‌ పౌరులకు భారతీయులంటే కాస్తా అసూయ ఉండటం సహజమేనని నెటిజన్లు అంటున్నారు.

Exit mobile version