Site icon Prime9

Bangladesh MP Murdered: కోల్‌కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ

Bangladesh MP

Bangladesh MP

Bangladesh MP Murdered: బంగ్లాదేశ్‌ ఎంపీ కోలకతాలో మిస్సింగ్‌.. అయితే పోలీసులు ఆయన హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా పార్టీకి చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌. ఆయన ఈ నెల 12న బంగ్లాదేశ్‌ నుంచి కోలకతాకు వైద్య చికిత్స కోసం వచ్చారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే ఆయన కోలకతాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. ఆయన కోసం బుధవారం నుంచి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బంగ్లాదేశ్‌ అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నాయకుడు అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌.. ప్రస్తుతం ఆయన మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచాప్‌ చేసి ఉంది.

ఈ నెల 12న కోల్‌కతాకు రాక..(Bangladesh MP Murdered)

అయితే పోలీసులు మాత్రం ఆయనను హత్య చేసి కోలకతాలోని న్యూటౌన్‌ ఏరియాలో పాతిపెట్టి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కాగా పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌లో న్యూటౌన్‌ ప్లాట్‌లో రక్తపు మరకలు కనిపించాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా 56 ఏళ్ల బంగ్లాదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు మే 12న కోలకతాకు వచ్చి తన మిత్రుడు గోపాల్‌ బిశ్వాస్‌ ఇంట్లో బస చేశాడు. రెండు రోజుల తర్వాత నుంచి ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. ఆయన ఆచూకీ తెలియకపోవడంతో గోపాల్‌ బిశ్వాస్‌ కోలకతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఎంపీ మిత్రుడు గోపాల్‌ సమాచారం ప్రకారం అన్వరుల్‌ ఈనెల 13 ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడని.. అటు నుంచి అతనితో కాంటాక్ట్‌ లేకుండా పోయిందన్నారు. దీంతో ఢాకాలో ఉన్న ఆయన కుటుంబసభ్యులతో మొబైల్‌ మేసేజ్‌ల ద్వారా సమాచారం పంచుకున్నానని చెప్పారు. ఢాకాలోని ఎంపీ కూతురుకు కూడా ఫోన్‌లో మీ తండ్రితో కాంటాక్టు కాలేకపోయానని చెప్పి .. వెంటనే అటు నుంచి కోలకతాలోని బారాన్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ ఫిర్యాదు చేశానని చెప్పాడు. మే 16న ఉదయం అన్వరుల్‌ అజిమ్‌ తన అసిస్టెంట్‌కు ఫోన్‌ చేస్తే కాంటాక్ట్‌ కాలేకపోయాడు. తర్వాత పీఏ కాల్‌ చేస్తే ఎంపీ జవాబు చెప్పలేదని మే18న రిజిస్టర్‌ చేసి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌ కుటుంబం బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా దృష్టికి ఎంపీ విషయం తీసుకువెళ్లారు. కాగా ఆమె ఢిల్లీతో పాటు కోలకతాలోని భారత రాయబారుల దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లారు. బంగ్లాదేశ్‌ ఎంపీ ఆచూకీ కోసం పెద్దెత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Exit mobile version