Site icon Prime9

Australia: ఆస్ట్రేలియా విద్యార్థి వీసాలకు కఠిన నిబంధనలు

Australia

Australia

Australia: ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెండ్స్‌ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీనితో పాటు దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులను రానివ్వమని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆ దేశ హోంమంత్రి క్లెయిరోనిల్‌ సోమవారం నాడు చెప్పారు.

వలసవాద విధానం ప్రక్షాళన (Australia)

వచ్చే రెండేళ్లలో దేశంలో వలసవాద విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఆయన అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు ఇంగ్లీషు టెస్టులో అత్యధిక రేటింగ్‌ సాధించాల్సి ఉంటుంది. దీంతో పాటు విద్యార్థి సెకండ్‌ వీసా దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీస్తామని ఆయన తెలిపారు. తమ వ్యూహం మాత్రం వలసవాదుల సంఖ్యను సాధారణ స్థితికి తేవడమేనని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే దేశంలో పెద్ద సంఖ్యలో వలసవాదులను అనుమతించడమే కాకుండా.. తమ దేశంలోని పెద్ద ఎత్తున అనుభవజ్ఞులైన వారికి మాత్రమే వీసాలు ఇస్తామని ఆస్ట్రేలియాభవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్‌ వారంతంలో జరిగిన సమీక్షలో దేశంలో వలసవాదుల సంఖ్య గురించి చర్చించారు.ప్రస్తుతం వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయిందని దీన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి దాన్నిచక్కదిద్దాల్సిందిగా హోంమంత్రికి ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం వలస వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చామని క్లెయిరోనిల్‌ చెప్పారు. ప్రస్తుతం వీసాలు ఉదారంగా ఇవ్వడం మానేశామని, దీంతో దేశంలో వలసవాదుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందని ఆయన అన్నారు. 2022-23లో దేశంలో రికార్డు స్థాయిలో 5 లక్షల పది వేల మంది వరకు వచ్చారు. దీనితో పెరిగిపోతున్న వలసలకు బ్రేక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అధికారిక గణాంకాల ప్రకారం వీసాలను 2024-25, 2025-26 నాటికి 2.5 లక్షలకు తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వలసల సంఖ్యను కోవిడ్‌ కంటే ముందున్న స్థాయికి తేవాలనేది ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ సర్వేలో 62 శాతం మంది దేశంలో వలసలు పెరిగిపోవడం వల్లే ఇళ్ల కొరత ఏర్పడిందని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం వలసలపై కొరడా ఝళిపించాలని నిర్ణయించింది. ఇక దేశంలో శాశ్వత నివాసం ఉండాలనుకునే వారు అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే అనుమతించాలనే నిర్ణయించింది.

Exit mobile version