Site icon Prime9

Bangladesh : బంగ్లాదేశ్ లో 14 హిందూ దేవాల‌యాల‌పై దాడి..విగ్ర‌హాలు ధ్వంసం

Bangladesh

Bangladesh

Bangladesh :  బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల బృందం

14 హిందూ దేవాలయాలపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసింది.

ఠాకూర్‌గావ్‌లోని బలియాడంగి  ఉపజిల్లా లోని

పలు గ్రామాలలో శనివారం రాత్రి మరియు ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి.

కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయగా, ఆలయ స్థలాల వెంబడి చెరువు నీటిలో కొన్ని కనిపించాయని

ఉప జిల్లా పూజా వేడుకల మండలి ప్రధాన కార్యదర్శి బర్మన్ తెలిపారు.

మేము వారిని చీకట్లో గుర్తించలేకపోయాము. అయితే విచారణల తర్వాత వారికి

న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము” అని అతను అన్నాడు.

హిందూ సంఘం నాయకుడు మరియు యూనియన్ పరిషత్ ఛైర్మన్ సమర్ ఛటర్జీ మాట్లాడుతూ

ఈ ప్రాంతం ఎల్లప్పుడూసర్వమత సామరస్యం ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.

గతంలో ఇక్కడ ఇలాంటి దారుణమైన సంఘటన జరగలేదు.

మెజారిటీ ముస్లింలతో మాకు ఎలాంటి వివాదాలు లేవు.

ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియలేదన్నారు.

ధంతాల యూనియన్‌లోని సిందూర్పిండి ప్రాంతంలో తొమ్మిది విగ్రహాలు,

పరియా యూనియన్‌లోని కాలేజ్‌పారా ప్రాంతంలో నాలుగు,

బంగ్లాదేశ్‌లోని చారోల్ యూనియన్‌లోని సహబాజ్‌పూర్ నాత్‌పరా ప్రాంతంలోని

ఒకే ఆలయంలో 14 విగ్రహాలు ధ్వంసం..

ఒక ఆలయంలో 14 విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినట్లు తెలిపింది.

శాంతియుత పరిస్థితులకు విఘాతం కలిగించేందుకు కుట్రపూరిత దాడి’: పోలీసులు

ఈ ఘటనపై ఠాకూర్‌గావ్‌ పోలీస్‌ చీఫ్‌ జహంగీర్‌ హొస్సేన్‌ విలేకరులతో మాట్లాడుతూ

బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలకు  విఘాతం కలిగించేందుకు జరిగిన దాడి..

దాడి చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.

వారు కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని

నేను మీకు హామీ ఇస్తున్నాను అంటూ అతను చెప్పాడు.

ఠాకూర్‌గావ్ డిప్యూటీ కమిషనర్ మహబూబుర్ రెహమాన్ హిందూ దేవాలయాలపై దాడులు

శాంతి మరియు మత సామరస్యానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర గాఅభివర్ణించారు.

నేరస్థులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

మెల్‌బోర్న్‌లో హిందూ దేవాలయాలపై దాడి..

జనవరి 12న, మెల్‌బోర్న్‌లోని ఒక హిందూ దేవాలయాన్ని

ఖలిస్తాన్ మద్దతుదారులు లక్ష్యంగా చేసుకున్నారు.

అందులో మిల్ పార్క్ శివారులోని స్వామినారాయణ్ మందిర్ గోడలను

గుర్తు తెలియని గుంపు “హిందూ-స్తాన్ ముర్దాబాద్” వంటి పదబంధాలతో ధ్వంసం చేసింది.

ఖలిస్తాన్ బృందం దామ్‌దామి తక్సల్ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను

ప్రశంసించింది.ఆలయ గోడలపై అమరవీరుడు అని రాసింది.

జనవరి 17న, మెల్‌బోర్న్‌లోని మరో హిందూ దేవాలయం విధ్వంసానికి గురయింది.

ఆస్ట్రేలియా టుడే ప్రకారం, శ్రీ శివ విష్ణు ఆలయాన్ని

ఖలిస్తాన్ మద్దతుదారులు “టార్గెట్ మోదీ”

వంటి రాతలతో ధ్వంసం చేశారు. ఆలయానికి భక్తులు రావడంతో

ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version