Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా చేసిన రాకెట్ దాడిలో 49 మంది మరణించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం కుప్యాన్‌స్క్ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్‌పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. సుమారు 49 మంది మరణించినట్లు చెప్పారు. బిల్డింగ్ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
క్రూరమైన ఉగ్రవాద దాడి ..(Ukraine)
కాగా, స్పెయిన్‌లో జరుగనున్న యూరప్ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. ఈ సంఘటనలో 48 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. మరోవైపు 19 నెలలుగా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నది.