Site icon Prime9

Army helicopter crash: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. 6గురు మృతి

Army helicopter crashed.. 6 people died

Army helicopter crashed.. 6 people died

Pakistan: పాకిస్ధాన్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి 6గురు వ్యక్తులు దుర్మరణం పాలైన్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. చనిపోయిన వారిలో ఇద్దరు ఆర్మీ మేజర్లు (పైలట్లు) ఉన్నట్లు తెలిపింది. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టాకు 121 కి.మీ దూరంలోని ఖోస్ట్ సమీపంలో జరిగిన్నట్లు పేర్కొనింది. రాత్రివేళల్లో ఓ మిషన్ నిర్వహిస్తుండగా హెలికాప్టర్ కూలిపోయిన్నట్లు ఆర్మీ తెలిపింది. మృతి చెందిన సమాచారాన్ని సైనికుల కుటుంబాలకు చేరవేసి సంతాపం తెలిపారు. గడిచిన రెండు నెలల్లో ఆర్మీ హెలికాప్టర్లు కూలిపోవడం ఇది రెండోసారి కావడంతో సైనికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

మరోవైపు ఘటనపై హెలికాప్టర్ల భద్రత పై విశ్లేషించాలని విపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు. గాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, హెలికాప్టర్లు తరచూ కుప్పకూలుతున్న ఘటనల పై ఇంజనీరింగ్ ఎవల్యూయేషన్ అనివార్యమని పేర్కొన్నారు.

 

Exit mobile version