Site icon Prime9

Apple AirTag: మాజీ భార్య ఎక్కడికెళ్తుందో తెలుసుకోవాలని ఎయిర్ ట్యాగ్స్ తో నిఘా

Apple AirTag

Apple AirTag

Apple AirTag: ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి వచ్చిదంటే.. దాన్ని మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తుంటారు చాలామంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

తాళం చెవులు, విలువైన వస్తువులు, బ్యాగ్ లు వంటి వాటిని ట్రాక్ చేయడానికి ‘ఎయిర్ ట్యాగ్స్ ’ పేరుతో యాపిల్ ఒక పరికరాన్ని అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరికరాన్ని మాజీ భార్యపై నిఘా గా ఉపయోగించాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.

భార్య ఎక్కడికెళ్తుందో తెలుసుకోవాలని..(Apple AirTag)

అమెరికాలోని టెన్నెసీలో కార్లొస్ అట్కిన్ అనే వ్యక్తి తన భార్యతో విభేదాల కారణంగా విడిగా నివాసం ఉంటున్నారు. అయితే తన మాజీ భార్య ఎప్పుడు.. ఎక్కడికి వెళ్తుంతో తెలుసుకోవాలని అట్కిన్ అనుకున్నాడు. ఇక అంతే తన భార్య వెహికల్ కు యాపిల్ ఎయిర్ ట్యాగ్ ను తగిలించాడు.

అప్పటి నుంచి ఆమెనే ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ నుంచి ఆమెను అనుసరించగా.. అసలు విషయాన్ని సదరు మహిళ గుర్తించింది. ఆమె ఓసారి తన సోదురుడి తో కలిసి బయటకు వెళ్లగా.. వారి కారుపై గులాబీలు ఉంచాడు.

మరో సందర్భంలో ఆమె సోదరి ఇంటికి వెళ్లాడు. అయితే తన మాజీ భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆ మహిళ అతన్ని హెచ్చరించింది.

అయినా, ఆగని అతడు ఫోన్ కాల్స్ ద్వారా ఆమెను విసిగించాడు. అయితే తన కారులో ఎయిర్ ట్యాగ్ పెట్టినట్టు గుర్తించినట్టు ఆమె చెప్పడంతో ఆట్కిన్ విస్తుపోయాడు.

విషయం బయటపడటంతో చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కేవలం ట్రాకింగ్ కోసమే ఆ పరికాన్ని వాడినట్టు చెప్పాడు.

ఆమె పోలీసులను ఆశ్రయించగా.. అక్రమంగా ట్రాక్ చేసినందుకు అతనిపై కేసు నమోదు అయింది.

 

దుర్వినియోగం అవుతాయనుకోలేదు: యాపిల్

ఈ ఘటనపై యాపిల్ సంస్థ కూడా స్పందించింది. ప్రజలు తమ వస్తువులను ఎక్కడ ఉంచామో తెలుసుకునేందుకు వీలుగా ఎయిర్ ట్యాగ్స్ ను అభివృద్ది చేశామని..

కానీ ఇలా దుర్వినియోగం అవుతాయని అనుకోలేదని తెలిపింది. ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు యాపిల్ పేర్కొంది.

సమాజంలో ఇలాంటి నిఘా చాలా సమస్యగా మారిందని.. ఎయిర్ ట్యాగ్ అభివృద్ధి సమయంలో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పింది.

యాపిల్ ట్యాగ్స్ ను ఉద్దేశ పూర్వకంగా నేరాలకు ఉపయోగించేవారిని గుర్తించేందుకు పోలీసులతో కలిసి పనిచేస్తామని యాపిల్ ప్రకటించింది.

 

ఎయిర్‌ట్యాగ్స్ ఎలా పనిచేస్తాయంటే..

తాళం చెవులు, విలువైన వస్తువులు పోతే ట్రాక్ చేయడానికి , బ్యాగులు లాంటి ఎక్కడ పెట్టామో గుర్తుపట్టడానికి ఎయిర్‌ట్యాగ్స్ ఉపయోగపడేలా యాపిల్ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది.

బ్లూటూత్ ఇన్ బిల్ట్ గా ఉండే ఈ డివైజ్‌ను కీచైన్‌గా ఉపయోగించవచ్చు.

లేదా యూజర్లు వాలెట్స్, బ్యాగుల్లో పెట్టుకుని ట్రాక్ చేసుకోవచ్చు. దీంతో కీచైన్, వాలెట్ వంటివి పోయినా, దొంగలు కొట్టేసినా ట్రాక్ చేసేందుకు బాగా పనికొస్తుంది.

 

Exit mobile version