Iran: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ఇరాన్‌లో సెలెబ్రిటి చెఫ్ మెహర్షాద్ షాహిదీ పోలీసుల చేతిలో దుర్మరణం పాలయ్యాడు. షాహిదీని బ్రిటన్‌కు చెందిన జెమీ ఆలివర్‌గా సంబోధిస్తుంటారు. అతనే 20వ పుట్టిన రోజు జరుపుకోవడానికి ఒక రోజు ముందే చనిపోవడం అందరిని కలచి వేసింది. ఇరాన్ మొత్తం విషాదచాయలు అలుముకున్నాయి. ఇరాన్ రెవెన్యూషనరీ గార్డ్స్ అత్యంత పాశవికంగా యువకుడైన షాహీదిని కొట్టి కొట్టి చంపారు. దీంతో ఇరాన్‌లో మరోసారి నిరసనలు మిన్నంటాయి. శనివారం నాడు జరిగిన ఆయన అంత్యక్రియలకు వేలాది మంది పౌరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాపనార్థాలు పెట్టారు.
ఇక అసలు విషయానికి వస్తే బ్రటిష్ టెలిగ్రాఫ్ పత్రిక సమాచారం ప్రకారం 19 ఏళ్ల సెలెబ్రిటి చెఫ్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినపపుడు ఆతడిని పోలీసులు అరెస్టు చేశారు. రాన్‌లో అరాక్ నగరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు లాఠీలతో కొట్టి కొట్టి చంపారు. ఆయన పుర్రె పై కూడా బలమైన గాయాలు తగిలాయి. అయితే ఆయన కుటుంబ సభ్యుల పై ఒత్తిడి తెచ్చి తమ కుమారుడు గుండెపోటుతో మరణించాడని బలవంతంగా చెప్పించారని చెబుతున్నారు.
ఇరానియన్ అధికారులు మాత్రం చెప్ మృతితో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక 7 న్యూస్ సమచారం ప్రకారం ఇరాన్ చీఫ్ జస్టిస్ అబ్దుల్‌మెహదీ మొసావీ కూడా చెఫ్ శరీరం పై ఎలాంటి గాయాల్లేవని, చేతులపైన కానీ, కాళ్లపై కానీ, లేదా పుర్రెపై కానీ, మెదడుపై ఎక్కడా గాయాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో పలువురు యూజర్లు సెలెబ్రిటి చీఫ్ మృతికి కారణం ఇరానీయన్ అధికారులదే బాధ్యత అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.