Site icon Prime9

China balloon : చైనా బెలూన్ ను కూల్చేసిన అమెరికా.. దీనిపై చైనా రియాక్షన్ ఏమిటి ?

China balloon

China balloon

 China balloon : యుఎస్ మిలిటరీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం దక్షిణ కరోలినా తీరంలోచైనా బెలూన్‌ను కూల్చివేసింది.

బెలూన్ కూల్చివేత నేపధ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.

బెలూన్ శిధిలాలను నేవీ నౌకలు సేకరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జనవరి 28 నుంచి అమెరికా గగనతలంలో చైనా బెలూన్ ..

బెలూన్ మొదట జనవరి 28న అమెరికా గగనతలంలోకి ప్రవేశించి జనవరి 30

సోమవారం కెనడియన్ గగనతలంలోకి ప్రవేశించింది.

ఆ తర్వాత జనవరి 31న తిరిగి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని యూఎస్ రక్షణ అధికారి ఒకరు తెలిపారు.

మోంటానా మీదుగా అధిక ఎత్తులో ఉన్న చైనీస్ నిఘా బెలూన్‌ను పెంటగాన్ గుర్తించింది.

దాదాపు 60,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న బెలూన్‌ను కిందకు దించాలని తాను బుధవారం

ఆదేశాలు జారీ చేశానని అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు.

చైనా బెలూన్ ను కూల్చేసిన అమెరిాకా వైమానిక దళం..( China balloon )

శనివారంఅట్లాంటిక్ మీదుగా వైమానిక దళం భారీ తెల్లని గోళాన్ని కాల్చివేసింది.

అమెరికా తీరానికి ఆరు నాటికల్ మైళ్ల దూరంలో బెలూన్ కూలింది.

ఈ మిషన్‌లో బహుళ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి.

వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి F-22 ఫైటర్ జెట్

మధ్యాహ్నం 2:39 గంటలకు బెలూన్ ను కూల్చివేసింది.

47 అడుగుల లోతు నీటిలో చైనా బెలూన్ శిధిలాలు..

బెలూన్ నీటిలో కూలిపోయిన తర్వాత, శిధిలాలు కనీసం 7 మైళ్ల వరకు

విస్తరించి 47 అడుగుల లోతు నీటిలో ఉంటాయని అంచనా.

నేవీ డిస్ట్రాయర్ యుఎస్‌ఎస్ ఆస్కార్ ఆస్టిన్, డాక్ ల్యాండింగ్ షిప్ యుఎస్‌ఎస్ కార్టర్ హాల్

గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ అయిన యుఎస్‌ఎస్ ఫిలిప్పైన్ సీ అన్నీ రికవరీ ప్రయత్నంలో భాగమని,

అవసరమైతే నేవీ డైవర్లు అందుబాటులో ఉంటారనిశిథిలాలను వెలికితీసి

వాటిని తిరిగి ఓడలకు చేర్చగలరని అధికారులు  తెలిపారు.

అమెరికా అతిగా స్పందించింది..చైనా

చైనా తన ‘నిఘా బెలూన్’ను యునైటెడ్ స్టేట్స్ కూల్చివేయడాన్ని తీవ్రమైన ఉల్లంఘన’ అని పేర్కొంది.

బెలూన్ కేవలం వాతావరణ పరిశోధనల కోసం ఉపయోగించే ఒక ఎయిర్‌షిప్ అని చైనా చెప్పింది.

సంయమనంతో” ప్రతిస్పందించడానికి బదులుగా యునైటెడ్ స్టేట్స్ బలాన్ని

ఉపయోగించాలని పట్టుబట్టింది. స్పష్టంగా అతిగా స్పందించిందని చైనా తెలిపింది.

సంబంధిత సంస్థల యొక్క చట్టబద్ధమైన హక్కులు మరియు ప్రయోజనాలను

చైనా దృఢంగా పరిరక్షిస్తుంది.తదుపరి అవసరమైన ప్రతిస్పందనలను

చేసే హక్కును కలిగి ఉంటుందని చైనా పేర్కొంది.

లాటిన్ అమెరికాలో మరో చైనా గూఢచారి బెలూన్ ..

మరో అనుమానిత చైనీస్ గూఢచారి బెలూన్ లాటిన్ అమెరికాపై కనిపించిందని,

వివరాలను అందించకుండా పెంటగాన్ శుక్రవారం తెలిపింది.

గత కొన్నేళ్లుగా, తూర్పు ఆసియా, దక్షిణాసియా మరియు యూరప్‌తో సహా

ఐదు ఖండాల్లోని దేశాలపై చైనా బెలూన్లు గతంలో గుర్తించబడ్డాయని సీనియర్ అధికారి తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version